Sara Tendulkar : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు??

లండన్ లో చదువు పూర్తి చేసి వచ్చిన సారా మోడలింగ్ వైపు అడుగుపెట్టింది. ఇప్పటికే పలు క్లోత్ బ్రాండ్స్ కి మోడలింగ్ చేస్తుంది. అంతే కాక సోషల్ మీడియాలో పలు బ్రాండ్లని ప్రమోట్.......

Sara Tendulkar :  బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు??

Sara

Sara Tendulkar :  క్రికెట్ దేవుడు, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండ్యూల్క‌ర్ క్రికెట్ కి దూరమైనా యాడ్స్ తోనో, ఏదైనా ఈవెంట్స్ తోనో తన ఫ్యాన్స్ ని పలకరిస్తూనే ఉన్నాడు. సచిన్ తనయుడు తండికి తగ్గట్టు క్రికెట్ లో నెగ్గుకురావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ. ఈ సెల‌బ్రిటీ కిడ్ సారాకి సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఒక్క ఇన్‌స్ట్రాగామ్‌లోనే ఆమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

లండన్ లో చదువు పూర్తి చేసి వచ్చిన సారా మోడలింగ్ వైపు అడుగుపెట్టింది. ఇప్పటికే పలు క్లోత్ బ్రాండ్స్ కి మోడలింగ్ చేస్తుంది. అంతే కాక సోషల్ మీడియాలో పలు బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ కూడా సంపాదించేస్తుంది. తాజాగా వచ్చిన బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం సారా హీరోయిన్ అవ్వడానికి కష్టపడుతుందట. ఇప్పటికే ఓ పక్క మోడలింగ్ చేస్తూ మరో పక్క నటనలో శిక్షణ తీసుకుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తన తండ్రి తలుచుకుంటే సారాని ఈజీగానే హీరోయిన్ చేయగలడు. కానీ సారా సొంతంగా కష్టపడి హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే పలు ఆడిషన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం.

Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?

 

ఇదే కానక నిజమైతే బాలీవుడ్ కి మరో హీరోయిన్ దొరికినట్టే. సారా ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ లతో, తన యాడ్స్ తో, మోడలింగ్ తో హల్ చల్ చేస్తుంది. ఇక హీరోయిన్ ఛాన్స్ వస్తే మరింత పెద్ద సెలబ్రిటీ అవ్వడం ఖాయం అంటున్నారు. సారా ఓ యువ క్రికెటర్ తో ప్రేమలో ఉంది అని కూడా బాలీవుడ్ వర్గాలు ఎప్పట్నుంచో అంటున్నాయి. మరి ఈ క్రికెట్ దిగ్గజం కూతురు బాలీవుడ్ వెండితెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.