Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?

టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఫ్లాప్ సినిమా లేని దర్శకుడు కొరటాల శివ.. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య విడుదలకి సిద్దమవుతుంది.

Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?

Acharya

Acharya: టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఫ్లాప్ సినిమా లేని దర్శకుడు కొరటాల శివ.. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య విడుదలకి సిద్దమవుతుంది. కాగా.. ఆచార్య కన్నా ముందే కొరటాల శివ రామ్ చరణ్ కోసం ఓ కథను రాసుకున్నాడట. ఆ కథను వినిపించడానికి చరణ్ ఇంటికి వెళ్తే అక్కడ చిరంజీవితో చర్చలలో ఆచార్య కాంబినేషన్ సెట్టైంది.

Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?

రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్న కొరటాల శివ కథను వినిపించేందుకు చిరంజీకి ఇంటికి వెళ్ళాడట. చరణ్ అప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు కమిటై ఉన్నాడు. దీంతో చరణ్ కోసం కాకుండా తనతో ఓ సినిమా చేయొచ్చు కదా అని చిరంజీవిని కొరటాలను అడగడంతో మరో కొత్త కథతో కొరటాల శివ మరోసారి ఇంటికి వెళ్ళాడట. అలా ఆచార్య సినిమా పట్టాలెక్కింది. ఈ విషయాన్ని చిరంజీవినే ఆచార్య ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి కొరటాల వద్ద చరణ్ కోసం రాసుకున్న కథ అలాగే ఉందని అర్ధమైంది.

Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

దీంతో చరణ్ కోసం కొరటాల రాసుకున్న ఆ కథేంటి అన్నది ఇప్పుడు మెగా అభిమానులలో ఆసక్తిగా మారింది. నిజానికి కొరటాల శివతో రామ్ చరణ్ ఎప్పుడో సినిమా చేయాల్సింది. కొరటాల మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ కాగానే రామ్ చరణ్ తో ఓ సినిమాకు సన్నాహాలు జరిగాయి. బండ్ల గణేష్ ఆ సినిమాకు నిర్మాత కాగా అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొరటాల శ్రీమంతుడు సినిమా చేశాడు. మళ్ళీ ఆచార్యకు ముందు కూడా ఓ కథను రాసుకున్నాడు. అనూహ్యంగా ఆ సినిమా కథ వద్దే ఆగిపోయింది. మరి ఫ్యూచర్ లో అయినా ఆ కథతో సినిమా ముందుకెళ్తుందేమో చూడాలి.