Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ....

Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?

Chiranjeevi Next Movie Also To Be A Multi Starrer

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో, మల్టీస్టారర్ మూవీగా ఆచార్య ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మల్టీస్టారర్ మూవీలపై చిరంజీవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi: రౌడీ హీరోకు చెక్ పెట్టిన మెగాస్టార్..?

ఆచార్య సినిమాతో పాటు చిరు నటించబోయే నెక్ట్స్ చిత్రాలు కూడా మల్టీస్టారర్ మూవీలుగా రాబోతున్నాయట. చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తుండగా, ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ముగించుకుంది చిత్ర యూనిట్. ఇక దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలోనూ మెగాస్టార్‌తో పాటు మరో స్టార్ హీరో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ తరువాత చిరు చేయబోయే మరో సినిమాలో కూడా ఇదే స్ట్రాటెజీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు వెంకీ కుడుములతో చిరంజీవి ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కథను కూడా లాక్ చేశాడు మెగాస్టార్. అయితే ఈ సినిమా కూడా మల్టీస్టారర్ మూవీగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ఉందని.. అందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా మొదలుకాని ఈ సినిమాలో ఏ స్టార్ హీరో నటిస్తాడా అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

ఏదేమైనా చిరంజీవి నటిస్తున్న వరుస సినిమాల్లో ఆయన మరో హీరోకు స్థానం ఉండేలా చూసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా వచ్చిన ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో, చిరు కూడా ఇలాంటి స్ట్రాటెజీని వాడాలని చూస్తున్నట్లు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ప్రతి సినిమాలోనూ చిరంజీవి మరో హీరోతో కనిపిస్తుండటం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఆయా సినిమాలకు వచ్చే రిజల్ట్‌ను బట్టి తేలిపోనుంది.