18 Pages: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్-అనుపమల 18 పేజెస్!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు.

18 Pages: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్-అనుపమల 18 పేజెస్!

Nikhil Siddharth Anupama Parameswaran's 18 Pages Streaming On OTT

18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు.

18 Pages: అదిరిపోయే న్యూస్ చెప్పిన ఆహా.. 18 పేజెస్ డేట్ ఫిక్స్!

ఇక ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్తతో ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలు నెట్‌ఫ్లిక్స్, ఆహాలో ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జనవరి 27 నుంచి ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో 18 పేజెస్ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చినట్లుగా సదరు ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రకటించాయి.

18 Pages: మరో బంపరాఫర్ కొట్టేసిన 18 పేజెస్ డైరెక్టర్..?

కాగా, ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ కూడా ఎంతో ఆస్తిని చూపుతున్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఓటీటీ ఆడియెన్స్‌ను ఈ మూవీ ఖచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని అందించగా.. GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.