Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్

హ్యాపీ డేస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సినిమాల విషయంలో ఇప్పుడు శాడ్ డేస్ అంటున్నాడు ఈ యంగ్ హీరో నిఖిల్.

Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్

Nikhil Siddharth

Nikhil Siddharth: హ్యాపీ డేస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సినిమాల విషయంలో ఇప్పుడు శాడ్ డేస్ అంటున్నాడు ఈ యంగ్ హీరో నిఖిల్. హిట్ వచ్చినా కూడా.. వరసగా సినిమాలు చేతిలో ఉన్నా కూడా ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేకపోతున్నానని తెగ బాధపడిపోతున్నాడు నిఖిల్. మరి నిఖిల్ సినిమాలు రిలీజ్ కాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

నా ఖర్మ ఎందుకిలా కాలిపోతుంది అన్న పాట లాగా.. ఇప్పుడు నిఖిల్ పరిస్తితి ఉంది. ఇలాగే ఉండడం కాదు.. ఇలాగే ఫీలవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి మరీ షేర్ చేసుకున్నాడు నిఖల్. అర్జున్ సురవరంతో అదిరిపోయేహిట్ ఇచ్చినా కూడా నెక్ట్స్ సినిమా రిలీజ్ చెయ్యడానికి రెండేళ్లు ఆగాల్సొచ్చిందని.. ఈ దరిద్రం అంతా కోవిడ్ వల్లనే అంటూ బాధపడుతున్నారు నిఖిల్.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

వరసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్న నిఖిల్ 2019లో అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దాంతో ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 4 సినిమాలు సైన్ చేశారు నిఖిల్. ఇక మళ్లీ మంచిరోజులొచ్చాయి.. వరసగా సినిమా రిలీజ్ లతో మళ్లీ ఫామ్ లోకొ వచ్చానని ఫుల్ హ్యపీ గా ఫీలైన నిఖిల్ కి.. ఈ పాండమిక్ వల్ల కోలుకోలేని దెబ్బ తగిలిందంటున్నారు. అప్పుడెప్పుడో మొదలైన 18 పేజెస్ తోపాటు కార్తికేయ 2 సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావల్సిందని, కోవిడ్ తో అన్నీ ఈగిపోయాయని వర్రీ అవుతున్నారు నిఖిల్.

Lahari Shari: ఫోటో షూట్లతో గ్లామర్ చిందిస్తున్న లహరి!

18 పేజెస్ తోపాటు కార్తికేయ 2 సినిమాలు చేస్తున్న నిఖిల్.. పోయిన సంవత్సరం మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. హిట్, గూడఛారి లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ తో స్పై ధ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు లవ్ స్టోరీ ప్రొడ్యూసర్లతో నిఖిల్ తన 20వ మూవీ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇవేవీ ఇంకా షూటింగ్ స్టేజ్ దాటి రిలీజ్ అవ్వలేదు. అయితే సినిమాల మీద ఫుల్ కానఫిడెంట్ గా ఉన్న నిఖిల్.. ఈకోవిడ్ తగ్గి తన సినిమాల ఆడియన్స్ ముందుకొచ్చే రోజు కోసం దేవుడి మీదే భారం వేసి వెయిట్ చేస్తున్నాడు.