Nithin : భార్యని గన్ తో బెదిరించిన నితిన్.. నేను సేఫ్ గా లేను అని పోస్ట్

నితిన్ భార్య షాలిని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో హీరో నితిన్ తన భార్యను గన్‌తో బెదిరిస్తున్నాడు. అయితే

Nithin : భార్యని గన్ తో బెదిరించిన నితిన్.. నేను సేఫ్ గా లేను అని పోస్ట్

Nithin

Nithin :  నిన్న దీపావళి సందర్భంగా సెలబ్రిటీలంతా తాము సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారు చేసుకున్న పూజలు, స్పెషల్ వంటకాలతో పాటు రాత్రికి కాల్చే క్రాకర్స్, వాటిని కలుస్తూ ఇలా రకరకాల ఫోటోలని, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరో నితిన్ వైఫ్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో థ్రిల్ లేదు.. ఈ సారి అమ్మాయిలు గెలుస్తారనుకున్నా.. కాని : కౌశల్

నితిన్ భార్య షాలిని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో హీరో నితిన్ తన భార్యను గన్‌తో బెదిరిస్తున్నాడు. అయితే అది నిజం గన్‌ కాదు. నిన్న దీపావళి పండుగ కాబట్టి పిల్లలు ఆడుకునే రీల్ గన్‌తో నితిన్ ఆడుకుంటూ తన భార్యను బెదిరిస్తున్నాడు. ఆ రీల్ చప్పుడుకు నితిన్ భార్య శాలిని భయపడుతూ చెవులు మూసుకుంది. ఈ వీడియోని షేర్ చేసి దీపావళి సేఫ్ గా జరుపుకోండి. నేను సేఫ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు అంటూ ఫన్నీగా నితిన్ ని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత నితిన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.