NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.

NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

NMACC Launching Event special food serve in silver plates photos goes viral

NMACC Launching Event : ఇటీవల రిలయన్స్(Reliance) ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ?(Nita Ambani) డ్రీం ప్రాజెక్టు ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్'(NMACC) ని ఘనంగా ప్రారంభించారు. భారతీయ సంసృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ని ప్రారంభించింది. ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ని ముంబైలోని జియో(Jio) వరల్డ్ సెంటర్ లో ఏర్పాటు చేశారు.

ఈ భవనంలో నాలుగంతస్థులు దీనికోసం కేటాయించగా ఇందులో ఒక మ్యూజియం, 2000 మంది ఒకేసారి కూర్చునే థియేటర్, ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్‌ కు రూమ్స్, స్టూడియో.. ఇంకా అనేక విశేషాలతో కూడి ఉంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు. ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ ఓపెనింగ్ కి రజినీకాంత్, షారుఖ్, సల్మాన్, వరుణ్ ధావన్, షారుఖ్ ఫ్యామిలీ, జాన్వీ కపూర్, సిద్దార్థ్ – కియారా, దీపికా- రణవీర్, అలియాభట్ ఫ్యామిలీ, ప్రియాంకచోప్రా ఫ్యామిలీ, అమీర్ ఖాన్, రష్మిక, సౌందర్య రజినీకాంత్, సద్గురు, సచిన్ ఫ్యామిలీ, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, హాలీవుడ్ ప్రముఖులు… ఇలా అనేకమంది రాగా ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఈవెంట్ కి వెళ్లిన పలువురు అక్కడ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొంతమంది ఆ కల్చరల్ సెంటర్ ఫోటోలు కూడా షేర్ చేయగా వాటిని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ గ్రాండ్ ఓపెనింగ్ లో పెట్టిన ఫుడ్ ని కూడా షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ పార్టీ ఇస్తున్నాడంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ మనం ఊహించే రేంజ్ కంటే గ్రాండ్ గా అంబానీ పార్టీ ఇస్తాడు.

Vijay : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళ్ స్టార్ విజయ్.. ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు..

తాజాగా ఈ NMACC ఓపెనింగ్ ఈవెంట్ కి వచ్చిన స్టార్ సెలబ్రిటీలకు వెండి పళ్ళాల్లో థాలీని అందించారు. ఓ పెద్ద వెండి పళ్లెంలో రోటీలు, పప్పు, పాలక్ పన్నీర్, హాల్వా, లడ్డు, కజ్జికాయ, పాపడ్, మరికొన్ని డిజర్ట్స్, వైన్ టేబుల్ మీద సర్వ్ చేశారు. వెండి పళ్లెంలో ఇవన్నీ కూడా తళతళ మెరిసిపోతున్నాయి. దీంతో వెండి పళ్ళాల్లో అంబానీ పెట్టిన ఈ ఫుడ్ ఫోటో వైరల్ గా మారింది. అంబానీ అంటే మినిమమ్ ఈ రేంజ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.