Vijay : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళ్ స్టార్ విజయ్.. ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు..

తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.

Vijay : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళ్ స్టార్ విజయ్.. ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు..

Tamil Star Hero Vijay entry in Social Media and creates records

Vijay :  తమిళ్(Tami) స్టార్ హీరో విజయ్(Vijay) కి అక్కడ ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. మన తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి ఉన్న రేంజ్ లో అక్కడ తమిళ్ లో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమా(Movie) రిలీజయితే అభిమానులకు పండగే. రిలీజ్ రోజు థియేటర్స్(Theaters) దద్దరిల్లాల్సిందే. ఇక విజయ్ సినిమా అప్డేట్, విజయ్ పుట్టిన రోజు, విజయ్ కి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానులు ఫుల్ గా సెలబ్రేట్ చేస్తారు.

తాజాగా ఈ తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. కానీ కొంతమంది స్టార్స్ ఇంకా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాంటి లిస్ట్ లో ఇన్నాళ్లు ఉన్న విజయ్ తాజాగా ఆదివారం (ఏప్రిల్ 2)న ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

actorvijay అనే పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి, మొదటగా లియో సినిమా సెట్స్ లో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు విజయ్. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. లియో షూట్ సమయంలో కాశ్మీ మంచులో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు విజయ్. ఈ అకౌంట్ ని విజయ్ స్టాఫ్ మెయింటైన్ చేయబోతున్నారు. మొదటి ఫోటో పోస్ట్ చేసి తమిళ్ లో నా స్నేహితులందరికీ హలో అని పోస్ట్ చేశారు. ఇక విజయ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాడని తెలియడంతో అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విజయ్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

Anasuya : ఆంటీ అని పిలిచేవాళ్ళని వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతా..

విజయ్ కేవలం గంటన్నరలో 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్నారు. మూడు గంటల్లో 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఇక హాఫ్ డేలో 3.7 మిలియన్స్ ఫాలోవర్స్ విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో చాలా తక్కువ టైంలో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిన స్టార్ గా ఇండియాలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అంతే కాకుండా వరల్డ్ లోనే అతి తక్కువ టైంలో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన అకౌంట్ గా మూడో ప్లేస్ లో, ఇండియాలో మొదటి ప్లేస్ లో నిలిచాడు విజయ్. వరల్డ్ లో తక్కువ టైంలో ఫాలోవర్స్ తెచ్చుకున్న వారిలో మొదటి ప్లేస్ లో BTS V, రెండో ప్లేస్ లో ఏంజెలినా జోలీ ఉన్నారు.

Image

కేవలం ఫాలోవర్స్ లోనే కాకుండా లైక్స్ లో కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు విజయ్. విజయ్ పోస్ట్ చేసిన మొదటి ఫొటోకి కేవలం 20 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించి కోలీవుడ్ స్టార్స్ లో అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన రికార్డ్ కొట్టాడు. అలాగే ఇప్పటికే ఈ ఫోటో 38 లక్షలకు పైగా లైక్స్ సాధించి అత్యధిక లైక్స్ సాధించిన మొదటి కోలీవుడ్ స్టార్ గా కూడా విజయ్ సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఇలా ఎంట్రీ తోనే విజయ్ సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మున్ముందు విజయ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.