Anasuya : ఆంటీ అని పిలిచేవాళ్ళని వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతా..

సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అనే అంటూ ఉంటారు. ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు.

Anasuya : ఆంటీ అని పిలిచేవాళ్ళని వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతా..

Anasuya comments again on Aunty Issue

Anasuya :  కొన్ని రోజుల క్రితం అనసూయని ఆంటీ అన్నారని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అన్నారని పోలీసు కేసు పెడతానంటూ హడావిడి చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు, ట్రాలర్లు మరింత అరెచ్చిపోయి ఏకంగా కొన్ని రోజులు ఆంటీ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండేలా చేశారు. కొన్ని రోజులు ఈ ఆంటీ వివాదం హడావిడి అయి ఆ తర్వాత సద్దుమణిగింది.

అయినా ఇప్పటికి కూడా పలువురు సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అనే అంటూ ఉంటారు. ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ సారి మాత్రం అనసూయ వీటికి ఎక్కువగా స్పందించలేదు. తాజాగా ఆదివారం నాడు ఇన్‌‌స్టాగ్రామ్ లో అభిమానులతో కాసేపు ముచ్చటించిన అనసూయ పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

Anasuya comments on Aunty Issue

ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని.. అక్కా మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడగగా.. అనసూయ సమాధానమిస్తూ.. ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ఇంపార్టెంట్, బెటర్ పనులు చాలా ఉన్నాయి అని సమాధానమిచ్చింది.

Karthik Dandu : యాక్సిడెంట్ తర్వాత తేజ్ లో భయం ఏర్పడింది.. షూటింగ్‌లో మాటలు సరిగ్గా వచ్చేవి కావు..

అలాగే మరో నెటిజన్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్. కానీ మీరు ఇప్పుడు ఇలా సైలెంట్ గా ఉండటం బాగోలేదు అని అడగగా.. థ్యాంక్యు. కానీ నేను సైలెంట్ గా లేను. జస్ట్ నా ఫోకస్ మార్చాను. మాట్లాడాల్సిన సమయంలో మళ్ళీ నేనే మాట్లాడతాను అని చెప్పింది. దీంతో మరోసారి ట్రోలింగ్స్ పై ఇండైరెక్ట్ గా అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.