Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. దర్శకుడు నక్కిని త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే అన్ని మాస్ అంశాలను పుష్కలంగా ఈ సినిమాలో చూపెట్టబోతున్నారట చిత్ర యూనిట్. అయితే ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఓ అంశం మాత్రం ఈ సినిమాలో మనకు కనిపించబోదని చిత్ర యూనిట్ చెబుతోంది.

Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

No Kiss Scenes In Dhamaka Between Raviteja And Sreeleela

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. దర్శకుడు నక్కిని త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే అన్ని మాస్ అంశాలను పుష్కలంగా ఈ సినిమాలో చూపెట్టబోతున్నారట చిత్ర యూనిట్. అయితే ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఓ అంశం మాత్రం ఈ సినిమాలో మనకు కనిపించబోదని చిత్ర యూనిట్ చెబుతోంది.

Dhamaka : టీవీ, యూట్యూబ్, ఈవెంట్స్.. మొదటిసారి ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ..

రవితేజ ఇటీవల నటించిన ప్రతి సినిమాలోనూ మనకు లిప్‌లాక్ సీన్స్ చాలా కనిపించాయి. దీంతో ఈ సినిమాలోనూ యంగ్ బ్యూటీ శ్రీలీలతో రవితేజ లిప్‌లాక్ సీన్ ఉంటుందని అభిమానులు ఆశగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎలాంటి ముద్దు సీన్స్‌కు రవితేజ నో చెప్పాడట. దానికి రెండు బలమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నాడు ఈ మాస్ హీరో. ఆయన నటించిన రీసెంట్ చిత్రాల్లో లిప్‌లాక్ సీన్స్ ఉండగా, అవి బాక్సాపీస్ వద్ద ఘోరంగా విఫలమవడం.. అటు హీరోయిన్ తనకంటే వయసులో చాలా చిన్నది కావడంతో శ్రీలీలకు రవితేజ ముద్దులు పెట్టలేదని తెలుస్తోంది.

Dhamaka: ‘ధమాకా’లో ఆ ఇద్దరి ట్రాక్ వేరే లెవెల్ అంటోన్న డైరెక్టర్!

ఏదేమైనా రొమాంటిక్ సీన్స్‌లో లిప్‌లాక్ లేకుండానే రవితేజ ఈ సినిమాలో నటించాడని తెలుసుకుని కొందరు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. హీరోయిన్ తనకంటే వయసులో చాలా చిన్నది కావడంతో రవితేజ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర సీనియర్ హీరోలు కూడా పాటిస్తే బాగుంటుందని పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించగా, ఇప్పటికే పాటలు ఆడియెన్స్‌కు బాగా ఎక్కేశాయి. మరి ఈ సినిమాలో రవితేజ-శ్రీలీల కెమిస్ట్రీ ముద్దులు లేకుండా ఎంతవరకు ఆడియెన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి.