Dhamaka: ‘ధమాకా’లో ఆ ఇద్దరి ట్రాక్ వేరే లెవెల్ అంటోన్న డైరెక్టర్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ మరోసారి తనదైన సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Dhamaka: ‘ధమాకా’లో ఆ ఇద్దరి ట్రాక్ వేరే లెవెల్ అంటోన్న డైరెక్టర్!

Dhamaka Movie To Have This Track Highlight

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ మరోసారి తనదైన సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ధమాకా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ధమాకా చిత్రం ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని ఆయన తెలిపారు. అంతేగాక, ఈ సినిమాలో మరో ఇద్దరు యాక్టర్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు.

Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

ధమాకా మూవీలో రావు రమేష్‌తో పాటు హైపర్ ఆదిలు కూడా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నక్కిన త్రినాథరావు తెలిపారు. రవితేజ పాత్రకు ఈ సినిమాలో ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో, అంతే ఇంపార్టెన్స్ ఈ ఇద్దరి ట్రాక్‌కు కూడా ఉంటుందని డైరెక్టర్ తెలిపారు. ఇక నక్కిన త్రినాథరావు చేసిన లేటెస్ట్ కామెంట్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరోసారి అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.