Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోండగా, ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

Dhamaka Locks OTT Partner

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోండగా, ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

Dhamaka : అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే.. అదిరిపోయిన ధమాకా టీజర్..

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుందట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని ఓటీటీ నిర్వాహకులు భావిస్తున్నారు. సాధారణంగానే రవితేజ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని, ఆడియెన్స్ ఆయన సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

Dhamaka Movie: దీపావళికి మాస్ ధమాకా పేలనుందా..?

అలాంటి రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంటే, ఇక ఓటీటీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.