Dhamaka : అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే.. అదిరిపోయిన ధమాకా టీజర్..

ధమాకా పేరుకు తగ్గట్టే టీజర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. మాస్ మహారాజ్ మరోసారి తన మాస్ రూపం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మీలో నేను విలన్ చూస్తే మీరు నాలోని హీరోని చూస్తారు అని ఓ మాస్ ఫైట్ తో.............

Dhamaka : అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే.. అదిరిపోయిన ధమాకా టీజర్..

Raviteja Dhamaka Mass Cracker released

Dhamaka :  రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన జింతాతా పాట బాగా పాపులర్ అయింది. తాజాగా ధమాకా మాస్ క్రాకర్ అనే పేరుతో సినిమా టీజర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్.

ధమాకా పేరుకు తగ్గట్టే టీజర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. మాస్ మహారాజ్ మరోసారి తన మాస్ రూపం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మీలో నేను విలన్ చూస్తే మీరు నాలోని హీరోని చూస్తారు అని ఓ మాస్ ఫైట్ తో టీజర్ మొదలుపెట్టారు. కొట్టేటప్పుడు నేను శాడిస్ట్ ని అని రవితేజ తన యాక్షన్ చూపించాడు. ఇక శ్రీలీలతో కలిసి చేసే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అలవైకుంఠపురం సినిమాలో నటించిన మలయాళ సీనియర్ హీరో జయరాం ఇందులో విలన్ గా నటించినట్టు తెలుస్తుంది. టీజర్ చివర్లో మరో విలన్ రవితేజకి గన్ చూపిస్తే రవితేజ వెనుక చాలా మంది బాడీగార్డులు వచ్చి నిల్చుంటారు. అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే అనే డైలాగ్ తో అదరగొట్టాడు రవితేజ.

Rajamouli : అమెరికా టు జపాన్.. విదేశాల్లోనే తిరుగుతున్న రాజమౌళి.. ఆస్కార్ వచ్చేదాకా వదిలిపెట్టేలాలేరు..

టీజర్ ఫుల్ మాస్ యాక్షన్ గా ఉండటంతో రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.