Rajamouli : అమెరికా టు జపాన్.. విదేశాల్లోనే తిరుగుతున్న రాజమౌళి.. ఆస్కార్ వచ్చేదాకా వదిలిపెట్టేలాలేరు..

4ఏళ్ల నుంచి కష్టపడి తెరకెక్కించిన ట్రిపుల్ఆర్ ని 6 నెలలక్రింత రిలీజ్ చేసినా ఇంకా ట్రిపుల్ఆర్ రాజమౌళిని మాత్రం వదలలేదు. రాజమౌళి కూడా ట్రిపుల్ఆర్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేంత వరకూ నిద్రపోయేలా లేరు........

Rajamouli : అమెరికా టు జపాన్.. విదేశాల్లోనే తిరుగుతున్న రాజమౌళి.. ఆస్కార్ వచ్చేదాకా వదిలిపెట్టేలాలేరు..

Rajamouli :  రాజమౌళి గత కొన్ని నెలలుగా యమా బిజీగా ఉన్నారు. దేశం కాని దేశాలలో ట్రిపుల్ఆర్ ని ప్రమోట్ చేసే పనిలో హడావిడిగా ఉన్నారు. బాహుబలి తో పోలిస్తే కమర్షియల్ గా ఆ రేంజ్ సక్సెస్ కొట్టకపోయినా RRR సినిమా రాజమౌళికి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది.

బాహుబలితో ఇండియన్ ఆడియన్స్ నే కాదు గ్లోబల్ ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ట్రిపుల్ఆర్ ని మొన్నటిదాకా అమెరికాలో ప్రచారం చేసి ఇప్పుడు జపాన్ లో రిలీజ్ చేయించే పనిలో ఉన్నారు. చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో పాన్ ఇండియా వైడ్ స్టార్ కాస్ట్ తో 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా జపాన్ లో నేడు అక్టోబర్ 21న రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ కి సంబందించి రాజమౌళి, చరణ్ ,ఎన్టీఆర్ ప్రెస్ మీట్లతో పాటు ప్రమోషన్ల పనిలో జపాన్ లో చక్కర్లు కొడుతున్నారు.

4ఏళ్ల నుంచి కష్టపడి తెరకెక్కించిన ట్రిపుల్ఆర్ ని 6 నెలలక్రింత రిలీజ్ చేసినా ఇంకా ట్రిపుల్ఆర్ రాజమౌళిని మాత్రం వదలలేదు. రాజమౌళి కూడా ట్రిపుల్ఆర్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేంత వరకూ నిద్రపోయేలా లేరు. రాజమౌళికి మాత్రం ట్రిపుల్ఆర్ మీద మోజు తగ్గలేదు అంటున్నారు. అందుకే ఇంకా అక్కడెక్కడో జపాన్ లో రిలీజ్ అవుతుంటే అమెరికాలో ఉన్న రాజమౌళి ప్రమోషన్ల కోసం పనిగట్టుకుని వెళ్లారు.

ట్రిపుల్ఆర్ ని రాజమౌళి వదిలేలా లేరు. అందుకే ఇండియా నుంచి అఫీషియల్ గా ఆస్కార్స్ కి నామినేట్ కాకపోయినా అమెరికాలో నెలల తరబడి ఉంది చేయాల్సిందంతా చేసి జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు ట్రిపుల్ఆర్ సినిమాని రాజమౌళి. ఆస్కార్ క్యాంపెయిన్ అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ట్రిపుల్ఆర్ ని లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. అంతేకాదు ఆస్కార్ ప్రమోషన్స్ కి అయ్యే ఖర్చంతా రాజమౌళే భరిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ కూడా నడుస్తోంది. ఈ లెక్కన ట్రిపుల్ ఆర్ సినిమాకి ఏదో ఒక విభాగంలో ఆస్కార్ వచ్చేదాకా ఫారెన్ నుంచి రాజమౌళి ఇండియా వచ్చేలా లేరంటున్నారు.

Pushpa 2 : బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని బీట్ చేసిన పుష్ప 2

ఇటీవల హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో RRR సినిమాకి ఆస్కార్ వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను, నా ఫిలిం మేకింగ్ మారదు అని అన్నారు. కానీ నెలల తరబడి విదేశాల్లో RRR సినిమాకి ఆస్కార్ తెప్పించే పనిలో రాజమౌళి తిరుగుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా RRR సినిమాకి ఆస్కార్ వస్తే మాత్రం మన దేశానికే గర్వకారణం.