Dhamaka Movie: దీపావళికి మాస్ ధమాకా పేలనుందా..?

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాతో గ్యారెంటీ హిట్ అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Dhamaka Movie: దీపావళికి మాస్ ధమాకా పేలనుందా..?

Dhamaka Movie To Get Release On This Date

Dhamaka Movie: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాతో గ్యారెంటీ హిట్ అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తుండటంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Dhamaka: ధమాకా అప్డేట్.. మాస్ రాజాకు ముహూర్తం ఫిక్స్..!

దీనికి తోడుగా ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, జింతాక్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి డ్యుయెల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సినిమాను అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Dhamaka: రొమాంటిక్ అప్డేట్ ఇస్తానంటోన్న మాస్ రాజా.. ధమాకా మామూలుగా ఉండదట!

దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే, ఆడియెన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చినట్లుగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తోండగా, భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. మరి దీపావళికి మాస్ ‘ధమాకా’ పేలుతుందా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.