Dhamaka: ధమాకా అప్డేట్.. మాస్ రాజాకు ముహూర్తం ఫిక్స్..!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, రవితేజ ఈ సినిమాతో మరోసారి తనదైన ఎనర్జీని ప్రేక్షకులు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని రెండో సింగిల్ పాటను రిలీజ్ చేసేందుకు ధమాకా యూనిట్ సిద్ధమయ్యింది.

Dhamaka: ధమాకా అప్డేట్.. మాస్ రాజాకు ముహూర్తం ఫిక్స్..!

Mass Raja Lyrical Song To Be Out From Dhamaka Movie

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, రవితేజ ఈ సినిమాతో మరోసారి తనదైన ఎనర్జీని ప్రేక్షకులు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ సినిమాగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Dhamaka Romantic Glimpse: ధమాకా రొమాంటిక్ గ్లింప్స్.. మాస్ రాజా వెరీ నాటీ!

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, జింతాక లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్సాన్స్ దక్కింది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుందని తొలిపాటతోనే ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని రెండో సింగిల్ పాటను రిలీజ్ చేసేందుకు ధమాకా యూనిట్ సిద్ధమయ్యింది. ‘మాస్ రాజా..’ అంటూ సాగే ఈ పాటను సెప్టెంబర్ 23న సాయంత్రం 5.01 గంటలకు లిరికల్ సాంగ్ రూపంలో రిలీజ్ చేసేందుకు రవితేజ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుండటంతో రవితేజతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.