Dhamaka Romantic Glimpse: ధమాకా రొమాంటిక్ గ్లింప్స్.. మాస్ రాజా వెరీ నాటీ!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ప్రేక్షకుల్లో అదిరిపోయే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు ఇటీవల రిలీజ్ అయిన ‘జింతాక్’ సాంగ్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే వినాయక చవితి సందర్భంగా ఓ రొమాంటిక్ గ్లింప్స్ వీడియోను ధమాకా యూనిట్ రిలీజ్ చేసింది.

Dhamaka Romantic Glimpse: ధమాకా రొమాంటిక్ గ్లింప్స్.. మాస్ రాజా వెరీ నాటీ!

Dhamaka Romantic Glimpse Looks Cool

Dhamaka Romantic Glimpse: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ప్రేక్షకుల్లో అదిరిపోయే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు ఇటీవల రిలీజ్ అయిన ‘జింతాక్’ సాంగ్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Dhamaka: రొమాంటిక్ అప్డేట్ ఇస్తానంటోన్న మాస్ రాజా.. ధమాకా మామూలుగా ఉండదట!

అయితే వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఈ మూవీలోని ఓ రొమాంటిక్ గ్లింప్స్ వీడియోను ధమాకా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో గ్లింప్స్ నిజంగానే రొమాంటిక్ అండ్ కూల్‌గా ఉండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోహీరోయిన్లు ఓ పెళ్లి మండపంలో ఉండగా, హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీలా వైపు రొమాంటిక్‌గా చూస్తూ ఉంటాడు. తన కళ్లతో ఆమెకు సైగలు చేస్తూ పక్కకు వెళ్దామని చెబుతాడు. దానికి అమ్మడు ముందుగా నో చెబుతోంది.

Dhamaka Jinthaak Song Update: జింతాక్ అంటూ ధమాకా అప్ డేట్ ఇచ్చిన మాస్ రాజా!

దీంతో రవితేజ కన్నీరు పెట్టుకున్నట్లుగా తన ఎక్స్‌ప్రెషన్ మార్చేస్తాడు. దీంతో కరిగిపోయిన హీరోయిన్ సరే వస్తానంటూ సైగలు చేస్తుంది. ఈ గ్లింప్స్ వీడియోకు చాలా మెలోడియస్ బీజీఎంను యాడ్ చేసి ఈ సీన్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మొత్తానికి పండగపూట రవితేజ మాస్‌ను పక్కనబెట్టి నాటీగా కనిపించడంతో ఆయన అభిమానులు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, భీమ్స్ సిసీరొలియో సంగీతం అందిస్తున్నాడు.