Dhamaka Jinthaak Song Update: జింతాక్ అంటూ ధమాకా అప్ డేట్ ఇచ్చిన మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రవితేజ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలోని ‘జింతాక్’ అనే మాసీ నెంబర్‌ను ఆగస్టు 18న మధ్యాహ్నం 12.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Dhamaka Jinthaak Song Update: జింతాక్ అంటూ ధమాకా అప్ డేట్ ఇచ్చిన మాస్ రాజా!

Dhamaka Jinthaak Song Update Impresses Audiences

Dhamaka Jinthaak Song Update: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రవితేజ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

అయితే, తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ధమాకా చిత్రం నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలోని ‘జింతాక్’ అనే మాసీ నెంబర్‌ను ఆగస్టు 18న మధ్యాహ్నం 12.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ అప్డేట్‌తో ధమాకా చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘విక్రమార్కుడు’ చిత్రంలో ‘జింతాత’ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు అదే తరహాలో ‘జింతాక్’ సాంగ్ కూడా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

మరి ధమాకా చిత్రం నుండి రాబోయే ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.