Dhamaka: రొమాంటిక్ అప్డేట్ ఇస్తానంటోన్న మాస్ రాజా.. ధమాకా మామూలుగా ఉండదట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ కోసం మాస్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి వినాయక చవితి కానుకగా ఓ రొమాంటిక్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Dhamaka: రొమాంటిక్ అప్డేట్ ఇస్తానంటోన్న మాస్ రాజా.. ధమాకా మామూలుగా ఉండదట!

Raviteja Dhamaka New Glimpse On The Way

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా మాస్ రాజా మరోసారి ఈ సినిమాతో తన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

Dhamaka Jinthaak Song Update: జింతాక్ అంటూ ధమాకా అప్ డేట్ ఇచ్చిన మాస్ రాజా!

ఇటీవల రిలీజ్ అయిన ‘జింతాక్’ సాంగ్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమా నుండి మరో అప్డేట్‌ను కోరుతున్నారు అభిమానులు. అయితే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాస్ రాజా అభిమానులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ధమాకా చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎప్పుడూ మాస్ అప్డేట్సేనా.. రొమాంటిక్ గ్లింప్సెస్ రావా.. అంటే వస్తున్నాయంటూ ధమాకా చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ గ్లింప్స్‌ను ఆగస్టు 31న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుండటంతో ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నుండి రాబోతున్న రొమాంటిక్ అప్డేట్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.