Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాపై మొదట్నుండీ ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ప్రేక్షకులకు ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రవితేజ స్వాగ్‌కు ఏమాత్రం తగ్గకుండా పక్కా మాస్ అంశాలతో ఈ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

Raviteja Shines In Dhamaka Trailer With His Swag

Dhamaka Trailer: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాపై మొదట్నుండీ ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ప్రేక్షకులకు ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రవితేజ స్వాగ్‌కు ఏమాత్రం తగ్గకుండా పక్కా మాస్ అంశాలతో ఈ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.

Dhamaka: సాలిడ్ రేటుకు హిందీ రైట్స్.. మాస్ రాజా ‘ధమాకా’ క్రేజ్ అలాంటిది!

ఇక ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. రవితేజ డ్యుయెల్ రోల్‌లో మరోసారి మాసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో రవితేజ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగుతూ రచ్చ చేసే పక్కా మాస్ పాత్రలో నటిస్తుండగా.. మరో పాత్రలో బడా బిజినెస్‌మెన్ కొడుకుగా కనిపిస్తున్నాడు. అయితే వారిద్దరినీ ఇష్టపడుతుంది ఈ సినిమాలోని హీరోయిన్. దీంతో వారిమధ్య ఎలాంటి రచ్చ సాగుతుందనేది మనకు చూపించబోతున్నారు. అంతేగాక బిజినెస్‌మెన్ కొడుకుకి ఎదురయ్యే సమస్యలను అతడి స్థానంలోకి వచ్చి మరో రవితేజ ఎలా సాల్వ్ చేశాడనేది ఈ సినిమా కథగా చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేయబోతుంది.

Dhamaka: ‘ధమాకా’ ట్రైలర్‌కు ముహూర్తం‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

కాగా, జయరాం చెప్పే ‘‘మనకు కావాల్సిన వాళ్లకి చేస్తే మోసం.. మనకి కావాలి అనుకున్న వాళ్లకి చేస్తే న్యాయం’’ డైలాగ్‌కు రవితేజ ‘‘త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్’’ అంటూ వేసిన కౌంటర్ భలే పేలింది. ప్రేక్షకులను ఈ డైలాగ్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌కు ఏమాత్రం కొదవ లేదని ట్రైలర్‌లోనే చూపెట్టారు. చివరగా రవితేజ చెప్పిన ‘‘నేను వెనక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడిని’’ అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే, రవితేజ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’ లాంటి సౌండ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.