Nani: నేచురల్ స్టార్ తో బోల్డ్ బ్యూటీ.. బాబోయ్ ఇది నెక్స్ట్ లెవల్ కాంబినేషన్
నాని(Nani) తన బ్లడీ రోమియో సినిమా కోసం బోల్డ్ బ్యూటీని ఒకే చేశాడట.
Tripti Dimri is playing female lead in Nani Bloody Romeo movie.
Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా హిట్ 3. యాక్షన్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ది ప్యారడైజ్ తరువాత నాని(Nani) ఓజీ దర్శకుడు సుజీత్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Pragya Jaiswal: గోల్డ్ కలర్ డ్రెస్సులో ప్రగ్యా ధగధగలు.. హాట్ ఫొటోలు వైరల్
ఈ సినిమా నటించబోయే హీరోయిన్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. నాని సినిమాలో హీరోయిన్ గా ముందు పూజ హెగ్డేను తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. కానీ, ఈ మధ్య కాలంలో పూజ ఫేమ్ చాలా వరకు తగ్గిపోయింది. అందుకే, ఆమెను పక్కన పెట్టి లేటెస్ట్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
యానిమల్ సినిమాతో త్రిప్తికి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా ఆమె ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కూడా చేస్తోంది. దాంతో, ఇప్పుడు ఆమె ఫేమ్ డబుల్ అయ్యింది. ఇక బ్లడీ రోమియో అనేది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి, త్రిప్తిని తీసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
