Dhamaka: సాలిడ్ రేటుకు హిందీ రైట్స్.. మాస్ రాజా ‘ధమాకా’ క్రేజ్ అలాంటిది!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసింద అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dhamaka: సాలిడ్ రేటుకు హిందీ రైట్స్.. మాస్ రాజా ‘ధమాకా’ క్రేజ్ అలాంటిది!

Dhamaka Hindi Rights Sold For A Bomb

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసింద అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dhamaka: ‘ధమాకా’ ట్రైలర్‌కు ముహూర్తం‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ మూవీని హిందీలో డబ్బింగ్ చేసి అక్కడ రిలీజ్ చేసేందుకు బాలీవుడ్ వర్గాలు భారీ మొత్తాన్ని చెల్లించినట్లుగా తెలుస్తోంది. ధమాకా సినిమా హిందీ రైట్స్‌ను ఏకంగా రూ.20 కోట్లకుపైగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉండగా.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.