Dhamaka: ‘ధమాకా’ ట్రైలర్‌కు ముహూర్తం‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రను ఊరమాస్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Dhamaka: ‘ధమాకా’ ట్రైలర్‌కు ముహూర్తం‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

Raviteja Dhamaka Movie Trailer Release Date Locked

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రను ఊరమాస్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

కాగా, తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 15న సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారని.. అది ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Dhamaka Movie: దీపావళికి మాస్ ధమాకా పేలనుందా..?

ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డిసెంబర్ 23న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.