Donald Trump: టారిఫ్స్ విషయంలో మరో బాంబు పేల్చిన ట్రంప్..!
ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా, ట్రంప్ మాత్రం తగ్గడం లేదు.
Donald Trump: టారిఫ్స్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదు అంటూ యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. టారిఫ్స్ విషయంలో మరో బాంబు పేల్చారు. గ్లోబల్ టారిఫ్స్‌ను 10 నుంచి 15 శాతానికి పెంచారు. దశాబ్దాలుగా పలు దేశాలు అమెరికాను దోచుకున్నాయని ఆయన ఎదురు దాడికి దిగారు. రాబోయే రోజుల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన సుంకాలను నిర్ణయించి అమలు చేస్తామని కూడా చెప్పారు.
కాగా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసిన సంగతి తెలిసిదే. ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా, ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10% టారిఫ్స్ విధించారు. ఇప్పుడు ఆ టారిఫ్స్ ను 15శాతం పెంచి అందరికీ షాక్ ఇచ్చారు.
