Venkatesh : వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటో?? అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..

F3 తర్వాత ఇప్పటివరకు నెక్స్ట్ ప్రాజెక్టు ని ఇంకా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. రీసెంట్ గానే హైదరాబాద్ లో కబీ ఈద్ కబీ దివాళి సినమాలో సల్మాన్ ఖాన్ తో నటించిన వెంకటేష్ ప్రస్తుతం ప్రస్తుతం...................

Venkatesh : వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటో?? అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..

Venkatesh

Venkatesh :  వెంకీ మామ, F2 సక్సెస్ తర్వాత నారప్ప, దృశ్యం 2 సినిమాలను కరోనా వల్ల డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేసి అక్కడ కూడా విజయం సాధించారు. ఇక ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ నటించిన F3 సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి భారీ విజయం సాధించింది. F3 తర్వాత సల్మాన్ ఖాన్ కోరడంతో కబీ ఈద్ కబీ దివాళి సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు వెంకీ.

F3 తర్వాత ఇప్పటివరకు నెక్స్ట్ ప్రాజెక్టు ని ఇంకా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. రీసెంట్ గానే హైదరాబాద్ లో కబీ ఈద్ కబీ దివాళి సినమాలో సల్మాన్ ఖాన్ తో నటించిన వెంకటేష్ ప్రస్తుతం ప్రస్తుతం ఖాలీగా ఉన్నారు. కథలు వింటున్నా ఏ కథకి ఓకే చెప్పట్లేదు అని సమాచారం. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, వెంకటేష్ కి కథ వినిపించగా అది వెంకీ మామకు బాగా నచ్చిందని సమాచారం. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్సవలేదు. ఈ లోపు ప్రస్తుతం అనుదీప్, శివకార్తికేయన్ తో కలిసి ప్రిన్స్ అనే బైలింగ్వల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Dabangg : సల్మాన్ లిస్ట్ లో దబాంగ్ 4 కూడా..

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ కి కథ వినిపించాడని, అది కూడా నచ్చిందని అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ని కూడా ఫైనల్ చేయలేదు. ఈ లోపు తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ సినిమా కీడా కోలా అని ప్రకటించాడు. గతంలో తేజ డైరెక్షన్ లో కూడా వెంకటేష్ సినిమా ఉంది అన్నారు కానీ అది కూడా లిస్ట్ లో లేదు. ఇక మలయాళంలో హిట్ అయిన బ్రోడాడీ సినిమాలో అక్కడ మోహన్ లాల్, పృద్విరాజ్ సుకుమారన్ కలిసి నటించగా ఆ సినిమా రీమేక్ హక్కులని సురేష్ ప్రొడక్షన్స్ కొనేసింది కూడా. ఆ సినిమాని వెంకీ, రానాలతో చేద్దాం అనుకున్నారు. కానీ దీనిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం రానాతో కలిసి రానా నాయుడు అని ఒక సిరీస్ చేస్తున్నారు వెంకీ. కానీ సినిమాలేవీ ప్రకటించకపోవడంతో వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు.