Dabangg : సల్మాన్ లిస్ట్ లో దబాంగ్ 4 కూడా..

దబాంగ్ సినిమాతో 2010లో భారీ హిట్ కొట్టాడు సల్మాన్. ఆ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టాడు. ఇక దబాంగ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దబాంగ్ 2,3 సినిమాలు కూడా భారీ విజయాలు..............

Dabangg : సల్మాన్ లిస్ట్ లో దబాంగ్ 4 కూడా..

Dabangg

Salman Khan :  దబాంగ్ సినిమాతో 2010లో భారీ హిట్ కొట్టాడు సల్మాన్. ఆ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టాడు. ఇక దబాంగ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దబాంగ్ 2,3 సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాల్లో చుల్ బుల్ పాండే గా సల్మాన్ అదరగొట్టాడు. ఇక దబాంగ్ సినిమాకి మరో సీక్వెల్ దబాంగ్ 4 కూడా లైన్ లో పెట్టేశాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ స్పీడ్ పెంచాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కబీ ఈద్ కబీ దివాలి, టైగర్ 3, నో ఎంట్రీ సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు సల్మాన్.

కోవిడ్ టైమ్ లో కాస్త గ్యాప్ తీసుకుని, రిలాక్స్ అయిన సల్మాన్ ఖాన్ భారీ కంబ్యాక్ తో ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారు. వరస సినిమాలతో స్పీడ్ పెంచిన భాయిజాన్ అప్ కమింగ్ లిస్ట్ లో దబాంగ్ 4 చేర్చి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాడు. తిగ్మాన్షు ధూలియా వినిపించిన దబాంగ్ 4 స్క్రిప్ట్ సల్లూభాయ్ ని ఇంప్రెస్ చేయడంతో చుల్ బుల్ పాండేను మరోసారి తెరమీద చూడాలని ఆయన ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

Alia Bhatt : కెన్యా అడవుల్లో రణ్‌బీర్‌ నాకు ప్రపోజ్ చేశాడు..

కబీ ఈద్ కబీ దివాళి శరవేగంగా పూర్తి చేస్తున్న భాయ్ జాన్ మరో పక్క టైగర్ 3 పట్టాలెక్కిస్తున్నాడు. ఆ తర్వాత నో ఎంట్రీ సీక్వెల్ ఉండనే ఉంది. ఆతర్వాత దబాంగ్ 4 చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. తిగ్మాన్షూ ధూలియా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. దర్శకత్వ బాధ్యతలు కూడా తిగ్మాన్షు తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. తిగ్మాన్షు.. హాసిల్, సాహెబ్ బీవి ఔర్ గ్యాంగ్ స్టర్ ఫ్రాంచైజీ, పాన్ సింగ్ తోమర్ లాంటి సినిమాలకు ధూలియానే దర్శకుడు. పాన్ సింగ్ తోమర్ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకున్న ధూలియా దబాంగ్ 4ను ట్రీట్మెంట్ ఎంతబాగా చేస్తాడో అనే ఎగ్జైట్ మెంట్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. ఇక తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీకి సరసన ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.