Alia Bhatt : కెన్యా అడవుల్లో రణ్‌బీర్‌ నాకు ప్రపోజ్ చేశాడు..

రణబీర్ తనకు ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేసాడో కూడా తెలిపింది అలియా. రణబీర్ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడింది. పెళ్ళికి ముందే చాలా రోజులు రణ్‌బీర్‌, ఆలియా డేటింగ్ లో ఉన్నారు. అలియా తమ ప్రేమ గురించి చెప్తూ.............

Alia Bhatt : కెన్యా అడవుల్లో రణ్‌బీర్‌ నాకు ప్రపోజ్ చేశాడు..
ad

Ranbir Kapoor :  బాలీవుడ్ ఫేమస్ షో కాఫీ విత్‌ కరణ్‌ తాజాగా కొత్త సీజన్‌ మొదలైంది. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఈ కాఫీ విత్ కరణ్ షో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇటీవలే మొదటి ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయింది. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి అలియాభట్, రణవీర్ సింగ్ గెస్టులుగా వచ్చారు. దీంతో వీరిద్దరూ ఈ ఎపిసోడ్ లో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో రణబీర్ తనకు ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేసాడో కూడా తెలిపింది అలియా. రణబీర్ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడింది. పెళ్ళికి ముందే చాలా రోజులు రణ్‌బీర్‌, ఆలియా డేటింగ్ లో ఉన్నారు. అలియా తమ ప్రేమ గురించి చెప్తూ.. ”మేము ఇద్దరం ఎప్పట్నుంచో డేటింగ్ లో ఉన్నా మా ప్రేమని వ్యక్తపరచలేదు. బ్రహ్మాస్త్ర సినిమా వర్క్‌షాప్‌లో మేము బాగా దగ్గరయ్యాము. ఒకసారి ఇద్దరం కలిసి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మేము ఒకరికోసం ఒకరు అని అర్ధం చేసుకున్నాము. కరోనా మొదటి పాండమిక్‌ తర్వాత మేమిద్దరం కెన్యాకు వెళ్ళాము. అక్కడ మసైమార జాతీయ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తిరుగుతున్నప్పుడు మరింత క్లోజ్ అయ్యాము. అక్కడే మా చూపులు కలిసి ఆ వన విహారం మధ్యలో రణ్‌బీర్‌ నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందాం అని అడిగాడు, నేను ఓకే చెప్పేశాను” అని తెలిపింది. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.

Chaithu : ఆ హీరోయిన్ గురించి మొత్తం తెలుసు అంటున్న నాగచైతన్య..

ఇక రణబీర్ ఫ్యామిలీ గురించి చెప్తూ.. ”రణబీర్ ఇంట్లో చాలా ట్రెడిషినల్ గా ఉంటారు. మన కల్చర్ ని బాగా ఫాలో అవుతారు. రణబీర్ కూడా బాగా ట్రెడిషినల్. నాకు కూడా అన్ని నేర్చుకోమని చెప్తాడు. ఇంట్లో పూజలు ఎక్కువగా చేస్తారు. అవి నాకు కూడా నచ్చుతున్నాయి. మెల్లి మెల్లిగా నేను వాటికి అలవాటు పడుతున్నాను. రణబీర్ వాళ్ళ నాన్న ఇంట్లో పూజ జరిగేటప్పుడు లేకపోతే వీడియో కాల్ చేసి మరీ పూజలో పాల్గొంటారు” అని తెలిపింది.