Naga Chaitanya : ఆ హీరోయిన్ గురించి మొత్తం తెలుసు అంటున్న నాగచైతన్య..

 నాగ చైతన్య ప్రస్తుతం వరుస హిట్స్, వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్వరలో నాగచైతన్య థ్యాంక్యూ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో రాశిఖన్నా ఒక హీరోయిన్ గా నటించింది. థ్యాంక్యూ సినిమా...........

Naga Chaitanya : ఆ హీరోయిన్ గురించి మొత్తం తెలుసు అంటున్న నాగచైతన్య..

Rashi Khanna

Naga Chaitanya :  నాగ చైతన్య ప్రస్తుతం వరుస హిట్స్, వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్వరలో నాగచైతన్య థ్యాంక్యూ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో రాశిఖన్నా ఒక హీరోయిన్ గా నటించింది. థ్యాంక్యూ సినిమా జులై 22న రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా నాగచైతన్య, రాశిఖన్నా కలిసి ఓ సరదా ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

ఈ ఇంటర్వ్యూలో చైతూకు రాశీ గురించి, అలాగే రాశీకి చైతూ గురించి ఎంత తెలుసో అడిగారు. దీంతో చైతూ రాశి గురించి మాట్లాడుతూ.. ”రాశీతో నేను రెండు సినిమాలు చేశాను. ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. షూట్‌లో కాస్త ఖాళీ టైం దొరికితే మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటాం. మా ఇష్టాయిష్టాలు, సినిమాలపై చర్చించుకుంటాం. అందుకే రాశి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు” అని తెలిపాడు.

Dhaakad : నెగిటివ్ రివ్యూలు, వార్తల వల్లే సినిమా ఫ్లాప్ అయింది.. బాలీవుడ్ మాఫియాపై అలా రాయగలరా?

ఇక రాశిఖన్నా చైతూ గురించి మాట్లాడుతూ.. ”చైతన్యకు రోడ్‌ ట్రిప్స్‌ అంటే చాలా ఇష్టం. చైతూకి సైట్ ఉంది, కళ్లద్దాలు వాడుతాడు. చైతూ దగ్గర మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి” అని తెలిపింది.