Dhaakad : నెగిటివ్ రివ్యూలు, వార్తల వల్లే సినిమా ఫ్లాప్ అయింది.. బాలీవుడ్ మాఫియాపై అలా రాయగలరా?

తాజాగా ‘ధాకడ్‌’ సినిమా గురించి కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదు. ఆలాంటి వ్యాఖ్యలని ఆయనే స్వయంగా ఖండించారు. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం.........

Dhaakad : నెగిటివ్ రివ్యూలు, వార్తల వల్లే సినిమా ఫ్లాప్ అయింది.. బాలీవుడ్ మాఫియాపై అలా రాయగలరా?

Dhaakad

Kangana Ranaut :  బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, బాలీవుడ్ ని రూల్ చేస్తున్న ఫ్యామిలీలపై మాట్లాడుతూ ఎప్పుడూ వ్యాఖ్యల్లో ఉంటుంది. కంగనా మెయిన్ లీడ్ లో నటించిన ‘ధాకడ్’ సినిమా ఇటీవల విడుదలయి ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా గురించి బాలీవుడ్ లో తెగ నెగిటివ్ రివ్యూలు రాశారు. సినిమా ఆ థియేటర్స్ లోనుంచి వెళ్ళాక కూడా ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమా వల్ల నిర్మాత చాలా నష్టపోయాడని, ఆస్తులు అమ్ముకున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

Adivi Sesh : బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లో కూడా ‘మేజర్’ టాప్ 1 పొజిషన్..

తాజాగా ఇలాంటి వ్యాఖ్యల గురించి, ‘ధాకడ్‌’ సినిమా గురించి కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”మా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదు. ఆలాంటి వ్యాఖ్యలని ఆయనే స్వయంగా ఖండించారు. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం కారణంగానే అది పరాజయం పాలైంది. ఇప్పటికీ రోజూ నిద్ర లేవగానే ‘ధాకడ్‌’పై ఇంటర్నెట్‌లో వందలాది నెగిటివ్ కథనాలు చదువుతున్నాను. ఇలా నా సినిమాపై నెగిటివ్ గా రాసేవాళ్ళు గంగూబాయి కఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 లాంటి చాలా ఫ్లాప్‌ సినిమాల గురించి, ఆ హీరో, హీరోయిన్ల గురించి ఎందుకు రాయారో? ఇలాంటి వార్తలు రాసేవారు బాలీవుడ్ మాఫియా తీసే సినిమాల గురించి అలా రాయగలరా?. ఇలాంటి వాళ్ళు చిల్లర వ్యక్తులు” అని తెలిపింది.