Hari Hara Veera Mallu : పవన్ సినిమాలో మొఘల్ రాణిగా బాలీవుడ్ బ్యూటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా 'హరిహర వీరమల్లు'. మొఘలుల బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో మూవీ టీం మొఘలుల పాత్రల కోసం స్టార్ క్యాస్ట్ ని తీసుకుంటుంది. ఇటీవలే ఈ మూవీలో మొఘల్ చక్రవర్తిగా నటించేందుకు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ని తీసుకున్నారు. తాజాగా..

Hari Hara Veera Mallu : పవన్ సినిమాలో మొఘల్ రాణిగా బాలీవుడ్ బ్యూటీ..

Nora Fatehi plays Mughal queen role in Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం మొట్టమొదటిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర వీరమల్లు జీవితకథ ఆధారంగా రాబోతుంది. 17వ శతాబ్దం కాలం నాటి కథ కావడంతో.. అప్పటి పరిస్థితులను మళ్ళీ రీ క్రియేట్ చేస్తూ భారీ సెట్ లు నిర్మిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఇప్పటికే చాలా లేటు అవుతూ వస్తుండడంతో, మూవీ టీం చిత్రీకరణలో వేగం పెంచింది.

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొఘలుల మీద పోరాటం చేయనున్నాడు. దీంతో మొఘలుల పాత్ర పోషించేందుకు చిత్ర యూనిట్ స్టార్ క్యాస్ట్ ని తీసుకుంటుంది. ఇటీవలే ఈ మూవీలో మొఘల్ చక్రవర్తిగా నటించేందుకు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ని తీసుకున్నారు. ఇప్పుడు మొఘల్ రాణి పాత్ర కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ లో పవన్, బాబీ డియోల్, నోరా ఫతేహి పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందుకు కోసం మేకర్స్ భారీ సెట్ ని రెడీ చేశారట. కాగా ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పథకంపై ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అమెరికన్ యాక్ట్రెస్ నర్గిస్ ఫఖ్రి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడది వేసవికి ఈ సినిమా విడుదల కానుంది.