Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఓ వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌లో సెట్ చేసి పెట్టాయి.

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Hari Hara Veera Mallu Producer Interesting Comments

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఓ వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌లో సెట్ చేసి పెట్టాయి.

Hari Hara Veera Mallu : ‘వీరమల్లు’ ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు..

కాగా, తాజాగా ఈ సినిమాపై చిత్ర నిర్మాత ఏఎం.రత్నం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్, ఏఎం.రత్నం కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఖుషి’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్న సందర్భంగా హరిహర వీరమల్లు మూవీపై ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీరమల్లు మూవీ కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదని.. హిందీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఇక పవన్ క్రేజ్‌ను ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత పెంచుతుందని ఆయన అన్నారు.

Hari Hara Veera Mallu : యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వీరమల్లు..

రీసెంట్‌గా షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ గురించి ఆయన మాట్లాడుతూ.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో పవన్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు నోరెళ్లబెడతారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు నిర్మాత తెలిపారు. పవన్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీపై నిర్మాత ఏఎం.రత్నం చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.