Hari Hara Veera Mallu : యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వీరమల్లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా మూవీ 'హరిహర వీరమల్లు'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. ప్రస్తుతం మూవీలోని కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అయితే సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఈ సీక్వెన్స్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.

Hari Hara Veera Mallu action schedule wrap up
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. ప్రస్తుతం మూవీలోని కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అయితే సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఈ సీక్వెన్స్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.
Pawan Kalyan: టైటిల్‌తో పాటు పవన్ కటౌట్ కూడా మారుస్తానంటోన్న హరీష్ శంకర్..?
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేక సెట్ ని నిర్మించింది చిత్ర యూనిట్. దాదాపు వెయ్యమంది టెక్నీషియన్స్ తో గత నెల రోజులుగా ఈ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించాడు ఫైట్ మాస్టర్ విజయ్. నేటితో యాక్షన్ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో, మూవీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కాగా న్యూ ఇయర్ కి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ రీ రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమా ప్రదర్శనతో పాటు ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ను కూడా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.