NTR 30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ మొదలవ్వలేదు, ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు NTR 30 యూనిట్. కొత్త సంవత్సరంలో మొదటి రోజునే NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి..........

NTR 30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

NTR 30 Movie release date announcement

NTR 30 :  యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2022లో రామ్ చరణ్ తో కలిసి RRR సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. RRR సినిమా తర్వాత నుంచి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్స్ లో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. కానీ వాటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు.

RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ మొదలవ్వలేదు, ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు NTR 30 యూనిట్. కొత్త సంవత్సరంలో మొదటి రోజునే NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా కొరటాల శివ-ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓ పోస్టర్, వాయిస్ రిలీజ్ చేయడంతో ఇది మాస్ యాక్షన్ సినిమాలా ఉండబోతుందని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా NTR 30 సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

Sudha : ఆ సమయంలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని అలా చేశాడు.. స్టార్ హీరో అయినా వాడు అనే అంటాను..

NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినందుకు అభిమానులు సంతోషించినా, మరీ అంత లేట్ గా రిలీజ్ ఎందుకు అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తెరపై కనపడి 9 నెలలు అవుతుంది. ఇంకా 15 నెలలు ఆగాలా అని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మొత్తానికి ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా అప్డేట్ న్యూ ఇయర్ రోజున ఇచ్చి అభిమానులకి జోష్ ఇచ్చారు.