Sudha : ఆ సమయంలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని అలా చేశాడు.. స్టార్ హీరో అయినా వాడు అనే అంటాను..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధ ఈ సీన్ సమయంలో జరిగిన ఓ సంఘటనని షేర్ చేసుకుంది. సుధ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేసే సీన్ లో ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అయినా ఎందుకో...............

Sudha : ఆ సమయంలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని అలా చేశాడు.. స్టార్ హీరో అయినా వాడు అనే అంటాను..

senior artist sudha comments on ntr

Sudha :  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసారు సీనియర్ ఆర్టిస్ట్ సుధ. తమిళ నటి అయినా హేమ సుధ తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయి అచ్చు తెలుగు వారిలా మారిపోయింది. ఎక్కువగా అమ్మ, అత్త పాత్రలతో ప్రేక్షకులని మెప్పించింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి సైత తల్లి, అత్త పాత్రల్లో నటించింది.

దాదాపు 500 కి పైగా సినిమాల్లో నటించిన సుధ ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్, సుధ కలిసి నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కి తల్లి పాత్రలో నటించారు. బాద్‌షా సినిమాలో ఓ సన్నివేశంలో పాత పాటలకి ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ వేసే సన్నివేశం ఉంటుంది. దీంట్లో ఎన్టీఆర్ తో కలిసి సుధ అదరగొట్టేసారు. ఈ సీన్ ఇప్పటికి బాగా పాపులర్.

Urfi Javed : ఆ బిజినెస్‌లు అన్నీ ఓ పెద్ద స్కామ్.. నేను చాలా నష్టపోయాను..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధ ఈ సీన్ సమయంలో జరిగిన ఓ సంఘటనని షేర్ చేసుకుంది. సుధ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేసే సీన్ లో ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అయినా ఎందుకో ఇంకో సారి చేస్తే బెటర్ ఏమో అని ఇంకో టేక్ తీసుకుందాం అన్నాను. బాగానే వచ్చింది ఇంకోటి ఎందుకు అని ఎన్టీఆర్ అన్నారు. అయినా నా కోసం అనడంతో ఓకే అన్నారు. సెకండ్ టైం చేసేటప్పుడు నా కాలు బెణికింది. అక్కడే పడిపోబోతుంటే ఎన్టీఆర్ పట్టుకొని కుర్చోపెట్టాడు. నా కాలు పట్టుకొని బెణికిన చోట పెయిన్ రిలీఫ్ స్ప్రే తెప్పించి స్ప్రే చేశాడు. నా కాలికి మర్దన చేశాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి అలా చేశాడు. ఎన్టీఆర్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చుసుకోండమ్మా జాగ్రత్తగా అని వేరే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు సంబంధం లేనట్టు. కానీ ఎన్టీఆర్ అలా తనే కాళ్ళు పట్టుకొని చేశాడు. అంత మంచివాడు. సాధారణంగా స్టార్ హీరోలని ఇండస్ట్రీలో గౌరవంగానే పిలుస్తారు. వారు, మీరు అని సంబోధిస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఎన్టీఆర్ ని వాడు అనే అంటాను. నా కొడుకులా ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ కూడా ఏమి అనడు అని తెలిపింది.