RRR : సుమకి చాదస్తం ఎక్కువ.. ఎప్పుడో పుట్టింది.. ఎన్టీఆర్ కామెంట్స్

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి మాట్లాడుతూ యాంకర్ సుమ మన అందరికి ఆత్మీయురాలు. ఇప్పుడు మెయిన్ లీడ్ లో సినిమా కూడా చేస్తుంది. మీరైతే ఎలాంటి రోల్ ఇస్తారు సుమకి అని ఎన్టీఆర్, రామ్ చరణ్...

RRR : సుమకి చాదస్తం ఎక్కువ.. ఎప్పుడో పుట్టింది.. ఎన్టీఆర్ కామెంట్స్

Suma

Anchor suma :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

 

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి మాట్లాడుతూ యాంకర్ సుమ మన అందరికి ఆత్మీయురాలు. ఇప్పుడు మెయిన్ లీడ్ లో సినిమా కూడా చేస్తుంది. మీరైతే ఎలాంటి రోల్ ఇస్తారు సుమకి అని ఎన్టీఆర్, రామ్ చరణ్ ని అడిగారు. దీనికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి. ఓ నాయనమ్మో, అమ్మమ్మో.. సుమకి బాగా చాదస్తం ఉంది. ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ ఈ రోజు లేరు. ఛాయాదేవి గారు, సూర్య కాంతం గారు, నిర్మలమ్మ గారు ఇలా నోరు పెద్దగా ఉండి అలాంటి క్యారెక్టర్స్ లో సుమ సెట్ అవుతుందని నా ఫీలింగ్. సుమని చూడగానే గయ్యాళి అత్తా ఇలాంటివే గుర్తొస్తాయి. నోరేసుకొని పడిపోతుంది. ఇప్పుడు పుట్టిన మనిషి కాదు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది సుమ” అంటూ ఫన్నీగా తెలిపారు.

RRR: ప్రమోషన్స్ జోష్.. గుజరాత్‌లో ల్యాండైన ఆర్ఆర్ఆర్ టీమ్!

రామ్ చరణ్ కూడా దీనికి మాట్లాడుతూ.. ”సుమకి గొడవలు సాల్వ్ చేసే మధ్యవర్తి క్యారెక్టర్ లాంటివి, కామిక్ గా ఉండే ఓ పెద్దమనిషి క్యారెక్టర్ లాంటివి ఇవ్వొచ్చు” అని అన్నారు.