RRR: ప్రమోషన్స్ జోష్.. గుజరాత్‌లో ల్యాండైన ఆర్ఆర్ఆర్ టీమ్!

మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి..

RRR: ప్రమోషన్స్ జోష్.. గుజరాత్‌లో ల్యాండైన ఆర్ఆర్ఆర్ టీమ్!

Rrr

RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చూసుకొనే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాకి మరింత పగడ్బంధీగా ప్రమోషన్లు ఏర్పాటు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయారు.

RRR: ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రీసౌండ్.. నో డౌట్ రికార్డు కొట్టాల్సిందే!

మరోవైపు ఇంకా ఇంకా నేషనల్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా జక్కన్న గీసిన కొత్త స్కెచ్.. నార్త్ మేకర్ మతి పోగొడుతోంది. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల తర్వాత దుబాయ్ ఈవెంట్.. అక్కడ నుండి శనివారం కర్ణాటక చిక్బల్లాపూర్, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసి, మళ్ళీ హైదరాబాద్ ఇలా నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్టయ్యేలా నయా స్కెచ్ వర్కవుట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ హై రేంజ్ ప్రమోషన్స్ కి తోడూ.. ప్రమోషన్ల లోకేషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తోన్న సందడి ఆకాశమే హద్దన్నట్టు ఉంది.

RRR: హనుమంతుడిలా రామ్ చరణ్.. శ్రీరాముడిలా ఎన్టీఆర్!

ప్రమోషన్స్ జోష్ ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ కర్ణాటక నుండి ఆదివారం గుజరాత్ లో అడుగుపెట్టింది. ఈ క్రేజీ ట్రయో ఆర్.. రాజమౌళి, రామ్ చరణ్, రామారావులు గుజరాత్ లో ల్యాండైన ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ప్రోగ్రాంకి గాను అక్కడి యూనిట్ ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం రెడీ చెయ్యడం మరింత ఆసక్తిగా మారిపోయింది. మొత్తంగా గుజరాత్ లో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్లను అదరగొడుతున్నారని చెప్పాలి.