RRR: ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రీసౌండ్.. నో డౌట్ రికార్డు కొట్టాల్సిందే!

ఇప్పుడంతా ట్రిపుల్ ఆర్ సందడే. మార్చ్ 25 వరకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడమే పనిగా పెట్టుకున్న ఈ మూవీ టీమ్.. కర్ణాటకలో చేసిన సందడి మామూలుగా లేదు. ఇటు చూస్తే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు..

RRR: ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రీసౌండ్.. నో డౌట్ రికార్డు కొట్టాల్సిందే!

Rrr Etthara Jenda

Updated On : March 20, 2022 / 1:03 PM IST

RRR: ఇప్పుడంతా ట్రిపుల్ ఆర్ సందడే. మార్చ్ 25 వరకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడమే పనిగా పెట్టుకున్న ఈ మూవీ టీమ్.. కర్ణాటకలో చేసిన సందడి మామూలుగా లేదు. ఇటు చూస్తే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జక్కన్న సినిమాకు భారీ ఆఫర్స్ ప్రకటించేస్తున్నాయి. ఇంకేముంది ఆడియెన్స్ ఎదురుచూపులు.. ప్రభుత్వాల నజరానాలు ట్రిపుల్ ఆర్ కు పుష్కలంగా కలిసిరాబోతున్నాయి.

RRR: హనుమంతుడిలా రామ్ చరణ్.. శ్రీరాముడిలా ఎన్టీఆర్!

పెద్ద ఎత్తున వర్కవుట్ చేస్తోన్న ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్.. ఫుల్ గా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ సినిమాగా మార్చ్ 25న వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ దానికి తగ్గట్టే హై రేంజ్ ప్రమోషన్స్ తో జోష్ చూపిస్తోంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ స్టార్స్ కర్ణాటక చిక్ బల్లాపూర్ లో చేసిన హడావిడీ మామూలుగా లేదు. పక్క రాష్ట్రంలో తారక్, చరణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మూవీలవర్స్ మతిపొగొడుతోంది. అక్కడ ప్రీరిలీజ్ ఫంక్షన్ అనగానే కన్నడ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అభిమానం చూపిస్తే.. దానికి తగ్గట్టే వాళ్లని సర్ ప్రైజ్ చేశారు రాజమౌళి, రామ్ చరణ్, రామారావ్.

RRR: చిరంజీవి గారు.. యుఆర్ఏ ట్రూ మెగాస్టార్.. రాజమౌళి కామెంట్స్!

పెద్ద ఎత్తున చేస్తున్న ఇలాంటి ప్రమోషన్స్.. ట్రిపుల్ ఆర్ సినిమాపై బజ్ డబుల్ చేసి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయనే అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల వరకు 5 షోలకు పెరిగిన టికెట్ రేట్లు.. ఫ్యాన్స్ గూబ గూయ్ మనిపిస్తోన్నా.. సినిమా ఎదురుచూపుల ముందు వాళ్లకా ఇష్యూ చిన్నగానే కనిపిస్తోంది. అటు ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ లోనూ ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది. మొత్తంగా ఇటు సొంత రాష్ట్రాలతో పాటూ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ట్రిపుల్ ఆర్ సౌండ్ గట్టి రీసౌండ్ నే వినిపించబోతుంది.