NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్‌ట్రా ఉండటమే మంచిదట..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అలవుతున్నా, ఇప్పటివరకు రెగ్యులర్ షూట్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్‌ట్రా ఉండటమే మంచిదట..?

NTR To Have Six Fingers In NTR30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అలవుతున్నా, ఇప్పటివరకు రెగ్యులర్ షూట్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత తారక్ నటిస్తున్న సినిమా కావడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

NTR30: ఎన్టీఆర్ విధ్వంసానికి నేల సరిపోదట.. నీటిలో వెతుకుతున్న చిత్ర యూనిట్!

అయితే ప్రస్తుతం తారక్ తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, దర్శకుడు కొరటాల మాత్రం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారాడు. ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ సెలెక్షన్‌లో కొరటాల బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్ చేతికి ఐదు వేళ్లు కాకుండా, ఆరు వేళ్లు ఉంటాయని.. అందులో ఆరో వేలు తారక్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.

NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..

ఎన్టీఆర్‌కు తెలియకుండానే ఈ ఆరో వేలు పలు రకాల సంకేతాలను ఇస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే ఈ సినిమాకు హైలైట్‌గా మారనుందని చిత్ర వర్గాల్లో వార్త వినిపిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమా కోసం తారక్ మరోసారి కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.