NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న రెండో చిత్రం "NTR30". అయితే సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటికి సెట్స్ పైకి వెళ్లకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రకమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మూవీ టీం.. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...

Koratal Siva speed up the NTR30 Pre Production Works
NTR30: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న రెండో చిత్రం “NTR30”. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గారేజ్’ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటికి సెట్స్ పైకి వెళ్లకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రకమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
NTR30: మెడికల్ మాఫియా కథాంశంతో ఎన్టీఆర్ కొరటాల సినిమా..
వీటికి చెక్ పెడుతూ మూవీ టీం.. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డైరెక్టర్ కొరటాల శివ, డిఓపి రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వారి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తి చేస్తున్నారని ప్రకటించగా, నేడు అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ.
“NTR30 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కొరటాల శివ, రత్నవేలు మరియు సాబుసిరిల్ ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు” అంటూ వెల్లడించారు నిర్మాతలు. త్వరలో షూటింగ్ పట్టాలు ఎక్కబోయే ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
#NTR30 pre production in full swing ?
Director #KoratalaSiva, @RathnaveluDop and @sabucyril putting in their best to create a spectacular cinematic experience ❤️?@tarak9999 @anirudhofficial @sreekar_prasad @NANDAMURIKALYAN @YuvasudhaArts pic.twitter.com/ysBe45WEiK
— NTR Arts (@NTRArtsOfficial) November 6, 2022