NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ...

NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?

Ntr30 Movie Was Rejected By Allu Arjun

NTR30: మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ వారు చేస్తున్న సందడి మామూలుగా లేదు. దీనికి తోడు తారక్ తన నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్లు ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక తమ అభిమాన హీరో చేయబోయే సినిమాల గురించి అప్పుడే వారు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుపుతున్నారు. అయితే తారక్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా, తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.

NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!

ఇక కొరటాల శివతో తారక్ చేయబోయే సినిమా గురించి కొందరు సోషల్ మీడియాలో ఓ వార్తను జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమా కథ తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం రెడీ చేసిందని.. అప్పట్లో ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. AA21 అనే ప్రాజెక్టును బన్నీతో కలిసి కొరటాల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!

అయితే బన్నీ పుష్ప చిత్రంతో బిజీగా మారిపోవడంతో కొరటాలతో సినిమాకు నో చెప్పాడని.. ఇప్పుడు అదే కథను తారక్‌తో చేసేందుకు కొరటాల రెడీ అయ్యాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని.. కొరటాల తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేసినట్లుగా గతకొద్ది రోజులుగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందేనని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30పై వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనని తారక్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

Ntr30 Movie Was Rejected