NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు తారక్.. యస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ కూ ఆసక్తి పెరిగింది.

NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!

NTR30

NTR30: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు తారక్.. యస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ కూ ఆసక్తి పెరిగింది. ఆయన నుంచి ఆప్ డేట్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న వాళ్లకు బర్త్ డే సర్ ప్రైజ్ అందించారు యంగ్ టైగర్. ఎన్టీఆర్ 30పైన పవర్ ఫుల్ అప్డేటిచ్చారు.. ఇక ఫ్యాన్స్ సంబరాలను రెట్టింపు చేస్తున్నారు.

NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!

పాన్ ఇండియా ఆడియన్స్, నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 అప్ డేట్ వచ్చేసింది. తారక్ బర్త్ డే రోజు వస్తుందనుకున్న ఊరమాస్ ప్రి లుక్ టీజర్ సరిగ్గా ఒక రోజు ముందుగానే వచ్చేసింది. ఎప్పటినుంచో వాయిదాపడుతోన్న ఎన్టీఆర్30.. లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తున్నా అని హింట్ ఇచ్చినట్టే ఉంది. ప్రి లుక్ టీజర్ డైలాగే గూస్ బంప్స్ తెప్పిస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక రోజు ముందుగానే బిగ్ సర్ ప్రైజ్ తో గ్రాండ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది.

NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!

మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఆల్రెడీ బర్త్ డే కామన్ డిపి హాష్ టాగ్స్ తో సందడి మొదలు పెట్టారు ఫ్యాన్స్.. ఈ ప్రిలుక్ టీజర్ తో ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్ కి తగినట్టే ఉండటంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కి బూస్టప్ నిచ్చారు కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత క్లాస్ లుక్ లో కనిపించినా.. మాస్ ఫినిషింగ్ ఉంటేనే మజా. అందుకే కొరటాల శివ ఎన్టీఆర్ ని ఊరమాస్ డైలాగ్ తో కత్తి పట్టిన చేతినే రివీల్ చేశారు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ టీజర్ తోనే ఫ్యాన్స్ కి సినిమా చూపించారు. ఎక్స్ పెక్టేషన్స్ కి ఏమాత్రమూ తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా చేయబోతున్నట్టు ప్రిలుక్ తోనే ఆడియన్స్ ను ప్రిపేర్ చేస్తున్నారు కొరటాల శివ. ఆచార్యతో ఎదురైన ఎదురు దెబ్బను గట్టిగా ఢీకొట్టి తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాలో మ్యూజిక్ ఇవ్వడానికి తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా కోలీవుడ్ బిగ్ స్టార్స్ ను తన మ్యూజిక్ తో క్రేజీ స్టెప్పులేయించాడు. కానీ టాలీవుడ్ స్ట్రైయిట్ మూవీతో సక్సెస్ కొట్టలేకపోయాడు అనిరుథ్. ఎలాగైనా టాలీవుడ్ లో సక్సెస్ కొట్టాలన్న కసితో ఉన్న అనిరుధ్, ఎన్టీఆర్30తో మరోసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఎలాంటి మ్యూజిక్ తో ఇక్కడ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తారో, ఫ్యాన్స్ ని కిర్రెక్కిస్తారో చూడాలి.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలును ఫైనల్ చేసారు మేకర్స్. అనిరుధ్ లాగానే ఫస్ట్ టైమ్ జూనియర్ తో వర్క్ చేయబోతున్నాడు రత్నవేలు. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న ఈ మూవీని సైతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లోనే కొరటాల ప్లాన్ చేసారు. ఆచార్య ఎఫెక్ట్ ఈ మూవీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కంబైన్డ్ గా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ… ఒకరోజు ముందే నందమూరి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. ఇక ఈరోజు బర్త్ డే రోజున ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఎన్టీఆర్ బర్త్ డే సంబరాల్లో మునిగి తేలుతున్నారు.