NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

Ntr30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో ముందుగా కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

ఇప్పటికే ఆచార్య మూవీ పనిలో దర్శకుడు కొరటాల బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ సినిమా ఆలస్యమవుతుండగా.. ఏప్రిల్ 29న ఆచార్య మూవీ రిలీజ్ కానుండడంతో మరో వారం పదిరోజులలోనే ఎన్టీఆర్ సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆచార్య ప్రమోషన్లలో మాట్లాడిన కొరటాల ఎన్టీఆర్ తో సినిమా గురించి కూడా రిలీవ్ చేసేశాడు. ఎన్టీఆర్ పాపం నన్ను తన సినిమా విషయంలో డిస్ట్రబ్ చేయడం లేదని.. `ఆచార్య` ఫినిష్ చేసుకున్నాకే మనం సినిమా మొదలు పెడదామని వెయిట్ చేస్తున్నాడని చెప్పాడు.

NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలన్నీ బయటపెట్టేస్తాం. మే 21 ఎన్టీఆర్ పుట్టిన రోజున అన్నీ బయటికి వస్తాయని.. అధికారికంగా అన్ని వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు కొరటాల శివ. గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనుండగా మరింత పగడ్బంధీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. హీరోయిన్ గా అలియా భట్ ఫైనల్ అని ప్రచారం జరగగా.. ఈ మధ్యనే ఆమెకి పెళ్లి కావడంతో కియారా అద్వానీ.. జాన్వీ కపూర్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.