NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తనకు జనతా గ్యారేజ్....

NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!

Ntr30 To Have A Schedule Planning Says Director Koratala

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ టీజర్‌ను ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయానికి ప్రారంభించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

కొరటాల శివ ‘ఆచార్య’ ఫ్లాప్‌తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దీంతో తారక్ సినిమాలో ఎలాంటి లోపాలు ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలోనే స్క్రిప్టు పనుల్లో మరింత సమయం తీసుకుంటున్నాడు కొరటాల. అయితే సినిమా షూటింగ్‌లో మాత్రం ఎలాంటి పొరపాటులు జరగకుండా ఉండేలా పక్కా ప్లానింగ్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. జూన్ లేదా జూలైలో షూటింగ్ మొదలుపెట్టాలని చూసినా, ప్రీ-ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమాను ఆగస్టులో పట్టాలెక్కించేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు. ఇక ఆ తరువాత కేవలం 6 నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, రిలీజ్‌కు రెడీ చేయాలని కొరటాల భావిస్తున్నాడు.

NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?

ఈ లెక్కన ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని వచ్చే సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తారక్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాను అనుకున్నట్లుగానే పక్కా ప్లానింగ్‌తో కొరటాల అండ్ టీమ్ తెరకెక్కిస్తారా లేక.. మళ్లీ ఏదైనా కారణంతో తమ ప్లాన్‌ను మార్చుకుంటారా అనేది చూడాలి.