Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

వరుస సినిమా రిలీజ్ లతో ఇక సినిమా ఇండస్ట్రీ ట్రాక్ లో పడ్డట్టే అని అనుకునేలోపే.. మూడోగండం ముంచుకొస్తోందని టెన్షన్ పడుతున్నాయి సినిమాలు. ఇప్పటికే పీక్స్ లో ప్రమోషన్లు చేస్తున్న..

Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

Rrr Radhe Shyam

Omicron Effect on Films: వరుస సినిమా రిలీజ్ లతో ఇక సినిమా ఇండస్ట్రీ ట్రాక్ లో పడ్డట్టే అని అనుకునేలోపే.. మూడోగండం ముంచుకొస్తోందని టెన్షన్ పడుతున్నాయి సినిమాలు. ఇప్పటికే పీక్స్ లో ప్రమోషన్లు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ నైట్ కర్ఫ్యూ దెబ్బకి సగం డీలా పడిపోయాయి. దీంతో ఆగకుండా ఏ నిమిషానికి ఏ వార్త వినాల్సొస్తుందో అని ఊపిరి బిగపట్టి చూస్తున్నాయి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు. ఇప్పుడిప్పుడే మంచి కలెక్షన్లతో సినిమా ఇండస్ట్రీ కోలుకుంటోందని అనుకునే లోపే.. ఒమిక్రాన్ ఇండస్ట్రీని టెన్షన్ పెడుతోంది.

Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులతో డిల్లీతో పాటు మరికొన్ని చోట్ల.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు మాస్ గేదరింగ్స్ అన్నిటినీ బ్యాన్ చేశారు. లేటెస్ట్ గా 6 రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా మొదలుపెట్టడంతో ధియేటర్లకు సెకండ్ షో వేసేఛాన్స్ లేదు. దాంతో రిలీజ్ కు రెడీగా ఉన్న ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఫుల్ టెన్షన్ లో ఉన్నాయి. జనవరి7న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది ట్రిపుల్ ఆర్ సినిమా. ఇప్పటికే సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ అయిన మహారాష్ట్రలో సెకండ్ షో రద్దు చెయ్యడంతో కలెక్షన్లు విపరీతంగా డ్రాప్ అవుతాయంటూ వర్రీ అవుతున్నారు మేకర్స్. పరిస్థితి ఇలా ఉంటే.. కలెక్షన్లు కాదుకదా మినిమం బ్రేక్ ఈవెన్ కి కూడా చాన్స్ కనిపించడం లేదు.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

సరే అని సినిమా రిలీజ్ చేద్దామంటే.. రిలీజ్ అయ్యేనాటికి ఇంకెన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారో, అసలు ఈ ఒమిక్రాన్ దెబ్బకి ఆడియన్స్ ధియేటర్లకు వస్తారో లేదో అన్న డౌట్. మరోవైపు రిలీజ్ చెయ్యకుండా హోల్డ్ చేద్దామంటే ఇప్పటికే సంవత్సరం డిలే అవ్వడంతో పాటు.. రోజురోజుకీపెరిగిపోతున్న ఇంట్రస్ట్ రేట్స్ ఇంకా ఇబ్బంది పెడతాయి. రిలీజ్ కు ఇంకా 2 వారాల టైమ్ తో పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్న ట్రిపుల్ఆర్ అసలు సినిమా పరిస్థితి ఏంటా అని తెగ వర్రీ అయిపోతోంది.

Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

మరోవైపు ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా ఇన్నాళ్లూ వెయిట్ చేసి ఇప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. మొన్నీమధ్యనే గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ చేసిన టీమ్.. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లు స్పీడప్ చేసింది. జనవరి 14న సంక్రాంతికి సోలోగా ఆడియన్స్ ముందుకొద్దామనుకున్న రాధేశ్యామ్ కి ఈ ఒమిక్రాన్ మరోసారి పెద్ద దెబ్బే కొట్టింది.

Singer Revanth: పెళ్లి కొడుకైన సింగర్ రేవంత్.. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

న్యూ ఇయర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకున్న ప్రభాస్ కి నార్త్ లో నైట్ కర్ఫ్యూ ఇబ్బందితో పాటు ఆల్రెడీ కేసులు పెరగడంతో ఓవర్సీస్ కలెక్షన్లు కూడా భారీగానే డ్రాప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎంత సౌత్ ఇండియన్ సినిమాలైనా.. బాలీవుడ్ కలెక్షన్ల మీద పాన్ ఇండియా పాపులారిటీ మీద ఫోకస్ చేసిన ఈ సినిమాలు ఈ ఒమిక్రాన్ గండాన్ని ఎలా ఫేస్ చెయ్యబోతున్నాయో, అసలు ఏం జరగబోతోందో అంటూ ఇండస్ట్రీ వైపు ఇంట్సస్టింగ్ గా చూస్తున్నారు.