Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

రిలీజ్ అవ్వాల్సిన సినిమాలకు కనీసం పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్స్ అయినా ఉంది. కానీ ధియేటర్లో ఉన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణం. రిలీజ్ అవ్వని సినిమాల టెన్షన్ ఒక టైతే.. ఇటు సినిమాలు..

Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

Omicron Effect On Films

Omicron Effect on Films: రిలీజ్ అవ్వాల్సిన సినిమాలకు కనీసం పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్స్ అయినా ఉంది. కానీ ధియేటర్లో ఉన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణం. రిలీజ్ అవ్వని సినిమాల టెన్షన్ ఒక టైతే.. ఇటు సినిమాలు రిలీజ్ చేసి కలెక్షన్లు డ్రాప్ అవుతున్న సినిమాలది మరో టెన్షన్. ఇప్పటి వరకూ వెయిట్ చేసి వాళ్లని వీళ్లని బతిమిలాడుకుని ఎవరూ అడ్డులేకుండా రిలీజ్ చేసుకున్న సినిమాల కలెక్షన్లకు బ్రేక్ వేసేసింది ఒమిక్రాన్. రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లు రాక, సినిమా చూడడానికి ఆడియన్స్ లేక, ధియేటర్లో సినిమాని కంటిన్యూ చెయ్యలేక.. తెగ తంటాలు పడుతున్నాయి పుష్ప, 83 సినిమాలు.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

లాస్ట్ వీక్ రిలీజ్ అయిన పుష్ప, ఈశుక్రవారం రిలీజ్ అయిన 83 ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. పుష్ప సినిమా డిసెంబర్ 17 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ తో పాటు ఇండియాలో కూడా మొన్నటి వరకూ మంచి కలెక్షన్లతో ఇప్పటి వరకూ 230 కోట్లుకలెక్ట్ చేసింది పుష్ప. అయితే 300 కోట్లకు పైనే టార్గెట్ పెట్టుకున్న టీమ్ కి ఈ కలెక్షన్లు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

ఇప్పటికే ఒమిక్రాన్ టెన్షన్ తో నైట్ కర్ఫ్యూ పెట్టడంతో రోజుకు 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తున్న నార్త్ షేర్ భారీగా తగ్గే ఛాన్సుందని వర్రీ అవుతున్నారు. నార్త్ లో పెద్దగా ప్రమోషన్లు చెయ్యకపోయినా.. కలెక్షన్లు మాత్రం బాగానే సంపాదిస్తోంది. కానీ ఈ కలెక్షన్లకు బ్రేక్ వేసేలా ఉంది ఒమిక్రాన్. పుష్పకి కనీసం వారం అయినా టైముంది కానీ ఈ శుక్రవారం రిలీజ్ అయిన 83 మాత్రం అసలు ఆమాత్రం కలెక్షన్లకు కూడా నోచుకోలేదు. రిలీజ్ అయిన రోజే బాలీవుడ్ సినిమాలకు మేజర్ మార్కెట్ అయిన మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఫస్ట్ రోజునుంచే కలెక్షన్లదెబ్బ పడింది 83కి. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ కలెక్షన్లకు మంచి స్కోప్ ఉన్నా ఆ ఛాన్స్ మీద గట్టిదెబ్బ కొట్టింది ఒమిక్రాన్.