Naatu Naatu Song : నాటు నాటు తో పాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన పాటలు ఇవే.. మీరు కూడా ఒకసారి వినేయండి..

బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి............

Naatu Naatu Song : నాటు నాటు తో పాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన పాటలు ఇవే..  మీరు కూడా ఒకసారి వినేయండి..

Oscar 2023 nominated best original songs full list and details along with Naatu Naatu

Naatu Naatu Song :  మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి.

నాటు నాటు సాంగ్ RRR సినిమా నుంచి నామినేట్ అయింది. ఈ పాటని చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీతం అందించారు.

Tell it Like A Woman సినిమా నుంచి applause సాంగ్ నామినేషన్స్ లో నిలిచింది. ఈ పాటకు సంగీతం, రచయిత రెండూ డయానా వారెన్ అందించారు.

టామ్ క్రూయిజ్ నటించిన Top Gun : Maveric సినిమా నుంచి Hold my Hand సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని పాప్ సింగర్ లేడీ గాగా, బ్లడ్ పాప్ ఇద్దరూ కలిసి రచించి సంగీతం అందించారు.

Black Panther : Wakanda forecer సినిమా నుంచి Lift me up సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని టెమ్స్, ర్యాన్ కూగ్లర్ కలిసి రాశారు. ఈ పాటకు సంగీతం టెమ్స్, రిహన్న, ర్యాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరాన్సన్ అందించారు.

Everything Everywher all at Once సినిమా నుంచి This is a Life సాంగ్ నామినేట్ లో నిలవగా ఈ పాటని ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే కలిసి రాయగా ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే, మిట్స్కి కలిసి సంగీతం అందించారు.

Naatu Naatu Song : నాటు నాటుకు మరో అవార్డు.. సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ హాలీవుడ్ నుంచి అభినందనలు..

ఈ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో అవార్డుని పాట రచయిత మరియు సంగీత దర్శకుడికి అందిస్తారు. ఇప్పటికే మన చంద్రబోస్, కీరవాణి అమెరికాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని అంతా భావిస్తున్నారు.