Naatu Naatu Song : నాటు నాటుకు మరో అవార్డు.. సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ హాలీవుడ్ నుంచి అభినందనలు..
నాటు నాటు సాంగ్ కి అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ ప్రత్యేకమైన ప్రశంసని అందించింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ లో............

Naatu Naatu Song Received Appreciation from society of composers and Lyricists
Naatu Naatu Song : ప్రపంచాన్ని, హాలీవుడ్ ని ఊపేసిన RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవార్డు అయిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో బెస్ట్ ఒరిజినల్ విభాగంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుకలు జరుగుతుండటంతో భారతీయులంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. నాటు నాటు సాంగ్ కి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. మరో ప్రఖ్యాత అవార్డు గోల్డెన్ గ్లోబ్ కూడా నాటు నాటు సాంగ్ సాధించింది. తాజాగా నాటు నాటు సాంగ్ కి మరో ప్రశంస దక్కింది.
నాటు నాటు సాంగ్ కి అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ ప్రత్యేకమైన ప్రశంసని అందించింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ కు గాను ఈ పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిలను అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందించారు. వేదికపై చంద్రబోస్ ఈ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అనంతరం చంద్రబోస్ ఈ ప్రశంసాపత్రాన్ని, స్టేజిపై ప్రముఖ హాలీవుడ్ గేయ రచయితలతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Naatu Naatu Song : నాటు నాటుకు ఆస్కార్ వస్తుందా? రాదా? టాలీవుడ్ లో కోట్లల్లో బెట్టింగ్..
నాటు నాటు పాటకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా చంద్రబోస్ పాటని రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. నాటు నాటు పాటని రాసి తెరకెక్కించడానికి దాదాపు 19 నెలలు పట్టిందని గతంలోనే చంద్రబోస్ చెప్పారు. ఇక ఇటీవల నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచినప్పుడు కూడా చంద్రబోస్ మాట్లాడుతూ.. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాలాంటి సామాన్య రచయితకి ఇది చాలా గొప్ప విజయం. నాటు నాటు పాట రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో నేను రాసిన ప్రతి పదం, నా చిన్నప్పటి పరిస్థితులు, నా మనస్సులోని భావాల్లోంచి వచ్చిందే. నా మనస్సులోని భావాలకు అక్షర రూపం ఇచ్చాను. ఆస్కార్ నామినేషన్ లో ఈ పాట ఉండటం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. హాలీవుడ్ పాటలకి ధీటుగా పోటీలో నిలిచింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబోస్ కూడా RRR యూనిట్ తో అమెరికాలో ఉండి సందడి చేస్తున్నారు.
Appreciation from society of composers and Lyricists❤️❤️❤️❤️❤️ pic.twitter.com/QhG4WJetWA
— chandrabose (@boselyricist) March 12, 2023