Oscars95: ఆస్కార్ నామినీలకు గిఫ్ట్ బ్యాగ్.. అందులో ఏముందో తెలుసా?

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం గతకొంత కాలంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా చూస్తూ వచ్చారు. ఇక నేడు ఈ అవార్డులను అందుకున్న వారిలో సంతోషం ఉప్పొంగిపోయి కనిపించింది. మన భారతీయులకు గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకుని చరిత్రను తిరగరాసింది.

Oscars95: ఆస్కార్ నామినీలకు గిఫ్ట్ బ్యాగ్.. అందులో ఏముందో తెలుసా?

Oscars95 Every Nominee Gets Oscar Gift Bag

Oscars95: ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం గతకొంత కాలంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా చూస్తూ వచ్చారు. ఇక నేడు ఈ అవార్డులను అందుకున్న వారిలో సంతోషం ఉప్పొంగిపోయి కనిపించింది. మన భారతీయులకు గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకుని చరిత్రను తిరగరాసింది.

Oscars95: ‘ఆర్ఆర్ఆర్’పై హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ కామెంట్స్.. మండిపడుతున్న అభిమానులు!

ఈ అవార్డల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి ఆస్కార్ బరిలో నిలిచిన నామినీలు హాజరయ్యారు. అయితే, అకాడమీ వారు ప్రతియేటా తమ అవార్డుల బరిలో నిలిచిన నామినీలకు ఓ గిఫ్ట్ బ్యాగ్‌ను బహూకరిస్తుంది. నామినీలు అవార్డును గెలిచినా, గెలవకపోయినా.. ఈ గిఫ్ట్ బ్యాగ్‌ను ఖచ్చితంగా ఇస్తుంది అకాడమీ. అయితే ఈ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంటుందా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఏయేడు నామినీలు అందుకున్న ఈ గిఫ్ట్ బ్యాగ్ విలువ $1,26,000 అని తెలుస్తోంది.

RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

ఇక ఈ బ్యాగ్‌లో ఏకంగా 60 రకాలకు పైగా బ్యూటీ, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన గిఫ్ట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. లగ్జరీ వెకేషన్‌కు సంబంధించిన టికెట్లు కూడా ఈ బ్యాగులో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా కూడా వారు ఉత్తచేతులో మాత్రం బయటకు రారు అనేది నిజం. అయితే, ఈ బ్యాగ్ గిఫ్ట్‌గా ఫ్రీగానే వచ్చినా, దాన్ని తమవెంట తీసుకెళ్లాలంటే కొంతమేర ట్యాక్స్ మాత్రం కట్టాల్సిందేనట.