Oscars95: ‘ఆర్ఆర్ఆర్’పై హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ కామెంట్స్.. మండిపడుతున్న అభిమానులు!

యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ముగిసింది. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో యావత్ ప్రపంచం ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. నాటు నాటు సాధించిన ఈ ట్రెమెండస్ ఫీట్‌తో ఇండియాలో ప్రతిఒక్కరు సంతోషంతో ఊగిపోతున్నారు.

Oscars95: ‘ఆర్ఆర్ఆర్’పై హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ కామెంట్స్.. మండిపడుతున్న అభిమానులు!

Oscars95 Host Jimmy Kimmel Comments On RRR Leaves Fans Unhappy

Oscars95: యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ముగిసింది. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో యావత్ ప్రపంచం ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. నాటు నాటు సాధించిన ఈ ట్రెమెండస్ ఫీట్‌తో ఇండియాలో ప్రతిఒక్కరు సంతోషంతో ఊగిపోతున్నారు.

RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

ఇదిలా ఉండగా, ప్రస్టీజియస్ ఆస్కార్స్ ఈవెంట్‌ను హోస్ట్ చేసిన జిమ్మీ కిమ్మెల్ ఆర్ఆర్ఆర్ మూవీపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ సినిమా అని జిమ్మీ కామెంట్ చేయడంతోనే ఈ వివాదానికి తెరలేపింది. దీంతో సోషల్ మీడియాలో జిమ్మీ కిమ్మెల్ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్. ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్‌ను హోస్ట్ చేస్తున్న వ్యక్తికి ఏ సినిమా ఏ భాషకు చెందిందో తెలియకుండానే ఆ సినిమాను బాలీవుడ్ మూవీ అని అనడంతో జిమ్మీపై తెలుగు అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.

Oscars95 : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇరగొట్టేశారు!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ సినిమా అని రాజమౌళి అండ్ టీమ్ పలు గ్లోబల్ స్థాయి ఈవెంట్స్‌లో పలుమార్లు వెల్లడించినా, అకాడమీ అవార్డ్స్‌లో జిమ్మీ కిమ్మెల్ ఇలా బాలీవుడ్ మూవీ అని అనడం ఎంతవరకు అంగీకరించే విషయం కాదని వారు మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా అకాడమీ వారు ఈ విషయంపై తమ వివరణ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.