OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్‌లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’

తెలుగు వారి ఓటీటీ ఆహాలో భయపెట్టడానికి రెజీనా 'అన్యాస్‌ ట్యుటోరియల్‌' వెబ్ సిరీస్ తో జులై 1న వస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి హారర్ ఇష్టపడే ఆడియన్స్ కి........

OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్‌లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’

Aha

OTT Releases :  థియేటర్లో పని కానిచ్చిన సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలు, సిరీస్ లు అయితే ప్రతి భాషలోనూ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ జులై 1న చాలా సినిమాలు, సిరీస్ లు ఓటీటీ బాట పట్టాయి. దీంతో ఈ వీకెండ్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ షురూ..

తెలుగు వారి ఓటీటీ ఆహాలో భయపెట్టడానికి రెజీనా ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ వెబ్ సిరీస్ తో జులై 1న వస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి హారర్ ఇష్టపడే ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ జులై 1 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. అలాగే ద టెర్మినల్‌ లిస్ట్‌, కుంగ్‌ఫూ పాండా: ద పాస్‌ ఆఫ్‌ డెస్టినీ రెండో సీజన్‌ కూడా రానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ లో రెబెల్డీ (రెండో సీజన్‌), బాగా పాపులర్ అయిన స్ట్రేంజర్‌ థింగ్స్‌ నాలుగో సీజన్‌ రెండో వాల్యూమ్‌, ద క్రేగ్స్‌లిస్ట్‌ కిల్లర్‌ స్ట్రీమ్ అవ్వనున్నాయి.

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ లో మియా బీవీ ఔర్‌ మర్డర్‌ జులై 1 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది.

Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..

జీ5 లో కంగనా ధాకడ్‌, షటప్‌ సోనా, మలయాళం కీడం సినిమా, బాపూ బహర్‌ భేజ్దే సినిమాలు రానున్నాయి. ఒకేరోజు ఇన్ని సినిమాలు, సిరీస్ లు స్ట్రీమ్ అవుతుండటంతో ఓటీటీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.